యూవీ క్రియేషన్స్ పద్దతి ప్లానింగ్ ఎలా ఉంటుందో గాని రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం చాలా చిరాకు తెప్పిస్తున్నారనే చెప్పాలి. అప్డేట్స్ కోసం ఆఖరికి యూవీ బ్యాన్ అనే వరకు తెచ్చుకున్నారు అంటేనే వారి పనితనం ఎలా ఉందో చెప్పొచ్చు. ఇక రాధేశ్యామ్ సినిమాను స్టార్ట్ చేసి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఇక ఇప్పుడు థమన్ కు వెల్కమ్ చెప్పారు. దీంతోమరోసారి అభిమానుల్లో నవ్వులపాలయ్యే వరకు వచ్చింది. అసలైతే సాహో సినిమా ఏడాదిలో ఫినిష్ కావాల్సిన ప్రాజెక్ట్.
అదే తరహాలో సాహోకు కూడా స్కెచ్ వేశారు. కానీ బాహుబలి రేంజ్ గురించి రకరకాలుగా ఆలోచించి సాహోను ఎటు కాకుండా చేశారు. ఇక సాహో కారణంగా బ్రేకులు పడ్డ రాధేశ్యామ్ కు కరోనా నుంచి గట్టి దెబ్బె పడింది. ఇక వాయిదాల పర్వంతో సినిమా ఫైనల్ గా జనవరిలో స్లాట్ దక్కించుకుంది. ఫైనల్ గా సినిమా జనవరి 14న రబోతోంది. అయితే విడుదలకు మరో 20 రోజుల సమయం పెట్టుకొని ఇప్పుడు థమన్ ను బ్యాక్ గ్రౌండ్ కోసం వెల్కమ్ బోర్డ్ పెట్టడాన్ని ఏమనలో అర్థం కావడం లేదని
ఓ వర్గం ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయినా ఒక సినిమాకు ముగ్గురు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఏమిటో అర్థం కావడం లేదని ఇటీవల థమన్ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బాలీవుడ్ పరువు దారుణంగా తీసేశాడు. పెళ్లి ఒకడితో ఫస్ట్ నైట్ ఇంకోడితో అన్నట్లు ఉందని కూడా కామెంట్ చేశాడు.ఏదేమైనా కూడా ఒక పాన్ ఇండియా సినిమాను తెరపైకి తీసుకు వస్తే రాజమౌళి తరహాలో పక్కా ప్లాన్ తో ముందుకు తీసుకు రావడం అంత ఈజీ కాదని అందరికి అర్థం అయ్యింది.
ఇక యూవీ నిర్మాతలకు అనుభవం లేదనుకుంటే ఓకే కానీ ఇదివరకే సాహోతో ఆల్ మోస్ట్ రిస్క్ చేసి వచ్చారు. ఇక ఇప్పుడు రాధేశ్యామ్ లో అయినా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఉంటారనుకుంటే చివరికి సాహో తరహాలోనే మ్యూజిక్ ఒకరితో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరొకరితో చేయిస్తున్నారు. అసలే లవ్ స్టొరీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు దర్శకుడితో లవ్ లో పడితేనే బెస్ట్ మ్యూజిక్ ఇస్తారని అంటారు. ఇక ఇప్పుడు సడన్ గా వచ్చిన థమన్ ఎలాంటి ఫీల్ ను కలిగిస్తాడో చూడాలి.