పోసాని తప్పు మాట్లాడాడు.. వాళ్ళు హీరోల మాటలే వినరు: తమ్మారెడ్డి భరద్వాజ్
- September 30, 2021 / 12:35 PM ISTByFilmy Focus
పోసాని కృష్ణ మురళి తన మాటలతో మిసియా టీవీ ఛానెల్స్ కు కూడా షాక్ ఇచ్చాడు. ఇప్పటికే ఆయన తీరుపై మీడియా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతే కాకుండా టీవీ ఛానెల్ యాంకర్లు ఆ ప్రసంగాలను టెలికాస్ట్ చేయడం చాలా కష్టంగా మారిందని చెబుతున్నారు. ఇక నిర్మాత మరియు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యలను ఉపయోగించిన భాషను ఖండించారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను విమర్శించే అన్ని హక్కులు పోసానికి ఉన్నాయి.
అయితే పవన్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు. పోసాని రాజకీయ సిద్ధాంతాలను అలాగే విధానాలపై పవన్‌పై ఎలాంటి కామెంట్స్ అయినా కూడా చేయవచ్చు కానీ అతని వ్యక్తిగత జీవితంపై కాదు. గతంలో కత్తి మహేష్ కూడా అదే విధంగా మాటలతో నోరు జారాడు అని ఆయన గుర్తు చేశారు. అయితే పవన్ అభిమానులు తిడుతున్నారని అనడం కూడా కరెక్ట్ కాదని వాళ్ళు ఏమైనా పవన్ సలహా తీసుకొని వెళుతున్నారా? కొన్నిసార్లు అభిమానులు తమ అభిమాన హీరోల మాట కూడా వినరు.

ఇక వారిని నియంత్రించడం కష్టమని భరద్వాజ్ అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూడా అభిమానులను ట్రోల్స్ చేయవద్దని కూడా బహిరంగంగానే హెచ్చరించారు. అయితే ఇది తెలిసినప్పటికీ కూడా అభిమానులను రెచ్చగొట్టడం పోసాని చేసిన పెద్ద తప్పు అని తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

















