చిరంజీవి (Chiranjeevi) “విశ్వంభర” (Vishwambhara) సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న తర్వాత సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో క్లారిటీ లేకుండాపోయింది. “గేమ్ ఛేంజర్” (Game Changer) క్రిస్మస్ నుండి సంక్రాంతి రేసులోకి మారడం, వెంకటేష్ (Venkatesh) -అనిల్ రావుపూడిల (Anil Ravipudi) కాంబినేషన్ సినిమా అయిన “సంక్రాంతికి వస్తున్నాం” (వర్కింగ్ టైటిల్) విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేకపోవడం, బాబీ (Bobby) దర్శకత్వంలో బాలయ్య (Balakrishna) హీరోగా రూపొందుతున్న సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ లేకపోవడంతో అసలు సంక్రాంతికి ఎవరు వస్తున్నారు? అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
Chandoo Mondeti
కట్ చేస్తే.. సడన్ గా సంక్రాంతి రేసులో నాగచైతన్య (Naga Chaitanya) వచ్చి చేరాడు. చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న “తండేల్” (Thandel) షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే. మరో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైపోతాయి. సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravind) “గీతా ఆర్ట్స్ 2” బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడం పెద్ద సమస్యేమీ కాదు.
కానీ.. చరణ్, వెంకటేష్, బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలందరూ తలపడుతున్న ఈ సంక్రాంతి సమరంలో నాగచైతన్య దూరడం అనేది సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా కలెక్షన్స్ విషయంలో దెబ్బపడుతుంది అనేది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. ఈ విషయమై ఇవాళ ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ దర్శకుడు చందు మొండేటి ఓ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “సంక్రాంతికి చరణ్ వస్తున్నాడని అల్లు అరవింద్ ఆలోచిస్తే మాత్రం సంక్రాంతికి “తండేల్” విడుదలవ్వడు.
డిసెంబర్ 25కి విడుదల చేయడం కష్టం, ఎందుకంటే సినిమా అప్పటికి రెడీ అవ్వదు” అని క్లారిటీ ఇచ్చాడు చందు మొండేటి. ఒకవేళ సంక్రాంతి రేసు నుండి “తండేల్” తప్పుకుంటే గనుక ఎప్పడు విడుదలవుతుంది అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో మంచి లవ్ స్టోరీ కూడా ఉంది కాబట్టి ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదల చేసిన బాగుంటుంది.