అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘మనం’ తర్వాత వచ్చిన మూవీ ‘థాంక్యూ’. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ వంటి క్రేజీ భామలు నటించిన ఈ మూవీ జూలై 22న విడుదలయ్యింది.కానీ మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఏమాత్రం అనుకున్న విధంగా నమోదు కాలేదు.
నాగ చైతన్య కెరీర్ లో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ నమోదు కాలేదు. ఫుల్ రన్లో కూడా ఈ మూవీ 25 శాతం రికవరీ సాధించలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
1.35 cr
సీడెడ్
0.44 cr
ఉత్తరాంధ్ర
0.59 cr
ఈస్ట్
0.32 cr
వెస్ట్
0.18 cr
గుంటూరు
0.23 cr
కృష్ణా
0.25 cr
నెల్లూరు
0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.28 cr
ఓవర్సీస్
0.90 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
4.68 cr
‘థాంక్యూ’ మూవీ రూ.23.85 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. క్లీన్ హిట్ అనిపించుకోవడానికి అంత మొత్తం రాబట్టాలి. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.4.68 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది ఈ మూవీ.ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.19.17 కోట్ల నష్టాలను మిగిల్చింది.
నాగ చైతన్య నటించిన సినిమాల్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘యుద్ధం శరణం’ మూవీ ఉండగా.. ‘థాంక్యూ’ ఆ సినిమాని మించిన డిజాస్టర్ గా మిగిలింది. దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య చేసిన రెండో మూవీ ఇది.