మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. దాదాపు 45 ఏళ్ళ నుండి టాలీవుడ్లో చక్రం తిప్పుతున్నారు ఆయన. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలు ఏలుతున్న టైంలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతికాలంలోనే హీరోగా మారి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.ఈ క్రమంలో కోదండరామిరెడ్డి డైరెక్షన్లో కృష్ణ చేయాల్సిన సినిమా… చిరంజీవి చేయాల్సి వచ్చింది.
చిరు కెరీర్లో ఈ సినిమా పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. అప్పటివరకు ప్రేక్షకులకి కనిపించిన చిరు వేరు.. ‘ఖైదీ’ లో కనిపించిన చిరు వేరు. ఆ తర్వాత చిరు మార్కెట్ 10 రెట్లు పెరిగింది. పెద్ద ప్రాజెక్టులు చిరు తలుపు తట్టాయి. అటు తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. చిరంజీవి కెరీర్లో దాదాపు 6 ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్లో ఏ హీరో కూడా అందుకోలేని ఫీట్ ఇది.
అలాగే చిరు (Chiranjeevi) కెరీర్లో డిజాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా షూటింగ్ మధ్యలో ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇక్కడి వరకు అందరికీ తెలుసు. కానీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ రిలీజ్ కానీ సినిమా ఒకటి ఉంది. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.
ఆ సినిమా మరేదో కాదు ‘శాంతినివాసం’. చిరంజీవి,మాధవి జంటగా నటించిన ఈ చిత్రానికి బాబు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. కానీ నిర్మాత మరణంతో ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. ఆ తర్వాత ఎందుకో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. .