Pushpa Movie: బన్నీ టు అనసూయ… ఎలా ఉండేవాళ్ళని.. ఎలా మార్చేశాడు..!

మన లెక్కల మాస్టారు సుకుమార్… ఈ మధ్యన రాజమౌళి కంటే దారుణంగా తయారయ్యాడు. నటీనటుల అవతారాలను మార్చడంలో రాజమౌళి ముందుంటాడన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సుకుమార్.. రాజమౌళిని పక్కకి నెత్తినట్టే కనిపిస్తుంది. ఈరోజు ‘పుష్ప ది రైజ్’ నుండీ విడుదలైన అనసూయ దాక్షాయణి లుక్ తో ఈ విషయం స్పష్టమైంది. లేకపోతే ‘జబర్దస్త్’ హాట్ యాంకర్ అనసూయ ఎంత గ్లామర్ గా ఉండేది. బుల్లితెరకి గ్లామర్ డెఫినిషన్ చెప్పింది కూడా ఆమెనే కదా..!

అలాంటి ఆమెని ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా మిడిల్ ఏజ్డ్ మహిళగా చూపించాడు. ఇప్పుడు ఏకంగా ఆమెను డీగ్లామరస్ గా చేసి లుక్ వదిలాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతుంది. దీనిని ఆధారం చేసుకుని ఇప్పటి వరకు ‘పుష్ప’ నుండీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ను కంపేర్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు మన నెటిజన్లు. స్టైలిష్ స్టార్ గా పేరొందిన బన్నీని ..పుష్ప రాజ్ గా రస్టిక్ లుక్ లోకి మార్చేశాడు.నేషనల్ క్రష్ ఇమేజ్ ను సంపాదించుకున్న రష్మిక ని శ్రీవల్లి అనే పల్లెటూరి అమ్మాయిగా మార్చేశాడు.

ఇక ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్న మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను భన్వర్ సింగ్ షెకావత్ గా గుండు లుక్ లో అరివీర భయంకరంగా చూపించాడు. అంతేకాకుండా మంగళం శ్రీను పాత్రని పోషిస్తున్న సునీల్ ను అలాగే జాలి రెడ్డి పాత్రని పోషిస్తున్న ధనుంజయ్ ను గుర్తుపట్టలేనంతగా మార్చేశాడు. అందుకే ‘ఎలా ఉండేవాళ్ళని ఎలా మార్చేశాడు మన లెక్కల మాస్టారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

1) అల్లు అర్జున్ – పుష్ప రాజ్

2) రష్మిక – శ్రీవల్లి

3) ఫహద్ ఫాజిల్ – భన్వర్ సింగ్ షెకావత్

4) అనసూయ – దాక్షాయణి

5) సునీల్ – మంగళం శ్రీను

6) ధనుంజయ్ – జాలి రెడ్డి

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus