పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నుంచి రాబోతున్న హారర్ ఎంటర్టైనర్ ది రాజాసాబ్ (The Rajasaab) పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకు మరింత పెరిగిపోతోంది. ఇప్పటికే సినిమా టైటిల్, విజువల్స్, మేకింగ్ విషయంలో క్రేజ్ బాగానే పెరిగింది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్‌పై ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లీక్ టాక్, అభిమానుల్లో క్యూరియాసిటీని రెట్టింపు చేస్తోంది. టీజర్‌కు సంబంధించిన ఓ రఫ్ కట్ ప్రివ్యూకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
అందులో ప్రభాస్ చెప్పే ఓ డైలాగ్ సోషల్ మీడియాను టార్గెట్ చేస్తూ ఉంటుందని సమాచారం. ఈ డైలాగ్ ట్రెండింగ్‌కు నచ్చేలా డిజైన్ చేసినట్లు టాక్. అలాగే ప్రభాస్ మాస్ అవతారాన్ని చూపించే ఓ సాంగ్ స్టైల్ లుక్ కూడా టీజర్‌లో ఉందని తెలుస్తోంది. మారుతి హ్యుమర్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిపితే ఎలా ఉంటుందో ఈ టీజర్ లోనే చూపించబోతున్నారని ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇంతవరకూ ది రాజాసాబ్ ని ఫ్యామిలీ హరర్ ఎంటర్టైనర్‌గా ప్రెజెంట్ చేస్తూ వచ్చారు.
కానీ ఈ టీజర్ మాత్రం మాస్ మూడ్ బేస్‌ను మరింతగా ఎలివేట్ చేయనుంది. కామెడీ, హారర్ టచ్‌తో పాటు ప్రభాస్ ఫ్యాన్స్‌కి కనువిందు చేసేలా గ్రాండ్ విజువల్స్, బడ్జెట్ విలువలు టీజర్‌లో రిఫ్లెక్ట్ అవుతాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ ట్విస్ట్ ఇచ్చే సీన్ టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ టీజర్ లీక్ గురించి వినిపిస్తున్న వార్తలతో ప్రభాస్ అభిమానుల్లో కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే మేకర్స్ మాత్రం అధికారికంగా టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించలేదు.
కానీ విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రభాస్ టీజర్ కావడంతో దీనిపై యూట్యూబ్‌లో భారీ హైప్ ఏర్పడనుంది. గతంలో సలార్ (Salaar), కల్కి (Kalki 2898 AD) టీజర్లకు వచ్చిన రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుంటే.. రాజాసాబ్ టీజర్ ఆ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడితో (Hanu Raghavapudi) ఫౌజీ, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) స్పిరిట్ (Spirit), నాగ్ అశ్విన్‌తో (Nag Ashwin) కల్కి 2898 ఏడి పార్ట్ 2, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సలార్ సీక్వెల్‌లతో వరుసగా కనిపించబోతున్నాడు.