Anushka: తమన్నా సంగతి ఓకే.. అనుష్క రాకపోవడానికి కారణం అదేనా..!

నిన్న ‘బాహుబలి'(ది బిగినింగ్) రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు, ప్రభాస్, రానా తో పాటు టీం అంతా ఒకచోట హాజరయ్యి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి హీరోయిన్లు అనుష్క, తమన్నా హాజరుకాలేదు. తమన్నా హైదరాబాద్లో లేదు. కాబట్టి.. హాజరు కాలేదు. కానీ అనుష్క హైదరాబాద్లోనే ఉందట. ‘ఘాటి’ సినిమాకు సంబంధించిన ప్యాచ్ వర్క్ లో ఆమె పాల్గొందని టాక్. అందుకే.. అనుష్క రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

Anushka

ఈ స్పెషల్ మీట్ కి సంబంధించి అనుష్కకి ముందే ఇన్వైట్ పంపడం జరిగిందట.కానీ ఆమె హాజరు కాలేదు. దీంతో రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది అనుష్కకి రాజమౌళితో గొడవ అయ్యిందని, ఇంకొంతమంది ప్రభాస్- అనుష్క..ల మధ్య గొడవల కారణంగా హాజరుకాలేదని ఇలా రకరకాలుగా చెప్పుకొంటున్నారు.

కానీ చివరికి అనుష్క వ్యక్తిగత కారణాలు అంటూ ఈ ఈవెంట్‌ను మిస్ అయ్యారు. ‘ఘాటి’ ప్రమోషన్స్ కోసం కూడా మీడియా ముందుకు రావడానికి అనుష్క ఇంట్రెస్ట్ చూపించడం లేదట. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. అనుష్క ఇప్పుడు మళ్ళీ లావయ్యిందని, ఆమె ఇప్పుడు ఫొటోల్లో, వీడియోల్లో కనిపిస్తే.. మళ్ళీ ఆమె గురించి నెగిటివ్ గా వార్తలు వస్తాయని..

అందుకే మీడియాకి కొన్నాళ్ళు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇది కూడా అఫీషియల్ కాకపోయినా… అనుష్క ‘ఘాటి’ సినిమాలో అనుష్కని స్లిమ్ గా చూపించేందుకు వి.ఎఫ్.ఎక్స్ ఎక్కువగా వాడుతున్నారు అనే టాక్ అయితే రన్ అవుతుంది. అందుకే ఆ టాక్ ను ఎక్కువ మంది నమ్మే అవకాశం ఉంది.

 విజయ్ దేవరకొండ మార్కెట్ ని వాడుకోవడం లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus