పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ. సినిమాని రిపీటెడ్ గా చూస్తూ ఎంజాయ్ చేయడమే కాకుండా.. ట్విట్టర్లో వారి ఎంజాయ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ‘సలార్’ ని గత 6 రోజులుగా ట్రెండింగ్ లో నిలబెడుతున్నారు.
అంతా హ్యాపీ కానీ ఒక్కటే లోటు..! (Salaar) ‘సలార్’ ని భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేశారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి పెద్ద టార్గెట్ నే చేధించాలి. సంక్రాంతి సినిమాలు వచ్చే వరకు ‘సలార్’ కి టైం ఉంది కాబట్టి పర్వాలేదు. అయితే నిన్న అంటే 6 వ రోజున ‘సలార్’ కలెక్షన్ సగానికి సగం వరకు పడిపోయాయి. 7 వ రోజు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ సో సోగానే ఉన్నాయి.
దీనికి ప్రధాన కారణం టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్లనే అని తెలుస్తుంది. నైజాంలో ఇంకా ‘సలార్’ టికెట్ రేట్లు రూ.410 వరకు ఉన్నాయి. అలాగే ఇంకా ఎక్కువ స్క్రీన్స్ ఉంచారు. పైగా మల్టీప్లెక్సుల్లో ఉదయం 8 గంటలకు కూడా షోలు వేస్తున్నారు. వీటి వల్ల షేర్ ఎక్కువగా రాదు. ఇప్పటివరకు ‘సలార్’ తెలుగు రాష్ట్రాల్లో రూ.125.06 కోట్లు షేర్ ని కలెక్ట్ చేసింది.
బ్రేక్ ఈవెన్ కి రూ.141.9 కోట్లు షేర్ ని కలెక్ట్ చేయాలి. అంటే ఇంకా రూ.16.84 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ వీకెండ్ కి టికెట్ రేట్లు తగ్గి.. హౌస్ ఫుల్స్ భారీగా పడితే తప్ప బ్రేక్ ఈవెన్ సాధించడం, ఎక్కువ లాభాలు ఆర్జించడం కష్టమనే చెప్పాలి.