బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) , మంచు మనోజ్ (Manchu Manoj) , నారా రోహిత్ (Nara Rohith) కాంబినేషన్లో ‘భైరవం’ (Bhairavam) అనే సినిమా రూపొందింది. తమిళంలో హిట్ అయిన ‘గరుడన్’ కి ఇది రీమేక్. ‘నాంది’ ‘ఉగ్రం’ వంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల (Vijay Kanakamedala ఈ చిత్రానికి దర్శకుడు. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కూతురు ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమవుతుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్.. వంటివి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో మనోజ్.. మంచు విష్ణుని (Manchu Vishnu) పర్సనల్ గా టార్గెట్ చేసి వేస్తున్న సెటైర్ల వల్ల వార్తల్లో నిలిచింది.
ఓ క్రమంలో ‘కన్నప్ప’ (Kannappa) సినిమాకి పోటీగా ‘భైరవం’ రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటన వచ్చింది. ఆ రకంగా కూడా ఈ సినిమా చర్చలకు దారి తీసింది. అయితే చివరికి మే 30న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ‘భైరవం’ మరో వివాదంలో చిక్కుకుంది. దీంతో ‘బాయ్ కాట్ భైరవం’ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తుంది మెగా అభిమానులు. ఆ ట్రోలింగ్ కు కారణం దర్శకుడు విజయ్ కనకమేడల.
విషయం ఏంటంటే.. 2011 లో విజయ్ కనకమేడల ఫేస్ బుక్ పేజీలో చిరంజీవి(Chiranjeevi), చరణ్(Ram Charan) ..లను ట్రోల్ చేస్తూ ఓ మార్ఫింగ్ పోస్ట్ ఉంది. ఇప్పటివరకు దీనిని మెగా అభిమానులు నోటీస్ చేయలేదు. ‘భైరవం’ ప్రమోషన్స్ లో కూడా విజయ్ పవన్ కళ్యాణ్ కి(Pawan Kalyan) , చిరంజీవికి వీరాభిమానిని అని చెప్పుకుంటూ వచ్చాడు. భవిష్యత్తులో వాళ్ళతో సినిమాలు చేయాలనే కోరిక ఉన్నట్టు కూడా తెలిపాడు. కానీ ఫేస్ బుక్ పోస్ట్ మాత్రం ఇలా ఉంది.
ఇక ఈ వ్యవహారంపై దర్శకుడు విజయ్ కనకమేడల స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘నా ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారు. దయచేసి నన్ను క్షమించండి’ అంటూ తన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు. కానీ ‘2011 లో హ్యాక్ చేసి పోస్ట్ పెడితే ఇప్పటివరకు చేసుకోలేదా అని కొందరు నెటిజన్లు’ చర్చించుకుంటున్నారు.
నమస్కారం
అందరికీ గుడ్ ఈవెనింగ్ అండీ..
మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అభిమానులకు అందరికీ గుడ్ ఈవెనింగ్. మేము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసాం. అప్పటి నుంచి నా మీద సోషల్ మీడియాలో కొంచెం ట్రోలింగ్…
— Vijay Kanakamedala (@DirVijayK) May 22, 2025