‘ప్రాజెక్ట్ కె’ సినిమాగా ఇక్కడి నుండి శాన్ డియాగో కామికాన్‌కి వెళ్లి ‘కల్కి 2898ఏడీ’గా మారింది ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా. ఈ సినిమా ప్రచారం కోసం ప్రభాస్, రానా, నాగ్ అఅ్విన్, అశ్వనీదత్ తదితరులు శాన్ డియాగో వెళ్లి హాజరయ్యారు. అయితే హీరోయిన్ దీపిక పడుకొణె మాత్రం హాజరు కాలేదు. బాలీవుడ్ హీరోయిన్ ఓ సినిమా ప్రచారాన్ని ఎగ్గొట్టడం చాలా అరుదు అని చెప్పొచ్చు. దీంతో అసలు ఏమైంది అనే చర్చ మొదలైంది. అయితే దీనికి క్లారిటీ ఓ సమ్మె అని సమాచారం.
కామికాన్‌కి (Deepika) దీపిక పడుకొణె కూడా వెళ్తుంది అని అంతా అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసేశారు అని చెప్పారు. అయితే తీరా చూస్తే.. ఆమె అక్కడకు వెళ్లలేదు. దీంతో ఏదో సినిమా షూటింగ్ ఉండి ఉండొచ్చు అని అనుకున్నారు. అయితే ఆమె ఆబ్సెంట్‌కి కారణం షూటింగులు కాదు. షూటింగ్‌లు లేకపోవడమే అంటున్నారు. అమెరికాలో మే నుండి స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఆధ్వర్యంలో నడిచే అమెరికన్ ఫెడరేషన్ అఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్ అసోసియషన్, రైటర్స్ గిల్డ్ అఫ్ అమెరికా నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నాయి.
ఆ సమ్మెనే ఇప్పుడు దీపిక ఈ ఈవెంట్‌లో పాల్గొనకుండా చేశాయి అంట. హాలీవుడ్ కార్మిక చట్టాలు తమ హక్కులని కాలరాసే విధంగా ఉన్నాయని నిరసన తెలుపుతూ ఆ అసోసియేషన్లు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాయి. ఈ సంఘంలో దీపీకా పడుకొణె కూడా సభ్యురాలు. దీంతో సంఘాల షరతుల ప్రకారం అమెరికాలో జరిగే ఎలాంటి ప్రోగ్రామ్స్, ప్రమోషనల్ ఈవెంట్లలో సభ్యులు పాల్గొనకూడదు. అందుకే దీపిక ఆ ఈవెంట్‌కి రాలేదట.
మరోవైపు అనారోగ్యం కారణంగా అమితాబ్ బచ్చన్ అనారోగ్యం కారణంగా ఈ ఈవెంట్‌కి హాజరు కాలేదు. ఇక కామికాన్‌లో వచ్చిన స్పందన… ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అటెన్షన్ తీసుకొచ్చింది. ఇప్పుడు వాటికి అనుగుణంగా సినిమాను సిద్ధం చేసి విడుదల చేయాలి. ఈ మేరకు దర్శకుడు నాగి ముందు పెద్ద సవాలే ఉంది అని చెప్పాలి.