ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమా టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావించగా ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లను సాధించిన ఈ సినిమా వీక్ డేస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలైంది. వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ప్రభాస్ కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అయితే ఇక్కడ కూడా ప్రభాస్ సినిమా భారీగా కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతూ ఉండటం గమనార్హం. ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డులు క్రియేట్ చేసిన రాధేశ్యామ్ కలెక్షన్లు ఐదోరోజున తెలుగు రాష్ట్రాల్లో కోటిన్నర కంటే తక్కువ మొత్తమని తెలుస్తోంది. ఈ వీకెండ్ తో రాధేశ్యామ్ థియేట్రికల్ రన్ ముగిసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఫుల్ రన్ లో రాధేశ్యామ్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవని సమాచారం.
మిరాకిల్స్ జరిగితే తప్ప రాధేశ్యామ్ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు సాధించకపోవడం గమనార్హం. యూవీ క్రియేషన్స్ కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల ఫలితాలు ఈ బ్యానర్ లో తెరకెక్కే తర్వాత సినిమాలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. అయితే రాధేశ్యామ్ సినిమా ఓటీటీలో ఏప్రిల్ లో అందుబాటులోకి వస్తుందని జరుగుతున్న ప్రచారం వల్ల ఈ సినిమాపై కొంతమంది ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఓటీటీ వార్తలు రాధేశ్యామ్ కు చేటు చేస్తున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. రాధేశ్యామ్ క్లాస్ మూవీ అయినప్పటికీ కథ, కథనం బలంగా లేవని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కెరీర్ పై రాధేశ్యామ్ మూవీ రిజల్ట్ ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభాస్ కెరీర్ పై రాధేశ్యామ్ ప్రభావం పడుతుందో లేదో చూడాల్సి ఉంది.