మీడియా మొఘల్, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు (Ramoji Rao) మరణం సినీ, రాజకీయ ప్రముఖులను ఎంతో బాధ పెట్టింది. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు నిర్మాణం చేయించుకున్న స్మృతి కట్టడం వద్దే అంతిమ సంస్కారాలు జరిగాయి. అంత్యకియల్లో చంద్రబాబు, లోకేశ్ తో పాటు వేర్వేరు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అయితే రామోజీరావు పార్థివ దేహాన్ని చూడటానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రాకపోవడం హాట్ టాపిక్ అవుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి రామోజీరావు పరిచయం చేశారు. హరికృష్ణకు (Harikrishna) ఇచ్చిన మాట కోసం రామోజీరావు నిన్ను చూడాలని సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ను టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే రామోజీరావు పార్థివ దేహాన్ని చూడటానికి తారక్ రాకపోవడానికి బలమైన కారణం ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) షూటింగ్ లో భాగంగా గోవాలో ఉన్నారని ఎన్టీఆర్ హైదరాబాద్ కు వస్తే షూట్ క్యాన్సిల్ కావడంతో పాటు మేకర్స్ పై భారీ స్థాయిలో భారం పడే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో ఉండి ఉంటే మాత్రం కచ్చితంగా రామోజీకి కడసారి నివాళులు అర్పించేవారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ సైతం భవిష్యత్తులో ఇందుకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మరో నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
దేవర సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాహుబలి1 (Baahubali) , సలార్1లా (Salaar) దేవర1 క్లైమాక్స్ కూడా ఊహలకు భిన్నంగా ఉండనుందని తెలుస్తోంది. దేవర సినిమా సక్సెస్ సాధించడం కొరటాల శివకు (Koratala Siva) కీలకం కానుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.