ఏదైనా ఒక సినిమాకు ఆస్కార్ అవార్డ్ దక్కిందంటే ఆ అవార్డ్ వెనుక ఉండే కష్టం అంతాఇంతా కాదు. ఆర్.ఆర్.ఆర్ మూవీకి ఆస్కార్ రావడం వెనుక రాజమౌళి కష్టం ఎంతో ఉంది. విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు రాజమౌళి స్క్రీన్ ప్లే తోడు కావడంతో పాటు చరణ్, ఎన్టీఆర్ తమ పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయడంతో ఆర్.ఆర్.ఆర్ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే.
కీరవాణి మ్యూజిక్, నాటు నాటు సాంగ్ కు చంద్రబోస్ సాహిత్యం ఈ సాంగ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లాయి.
కార్తికేయ లేకపోతే ఈ అవార్డ్ వచ్చేది కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమౌళి రమల కొడుకు అయిన కార్తికేయ ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాల్లో జోక్యం చేసుకోవడంతో పాటు సినిమా రేంజ్ పెరగడానికి కృషి చేశారు. కార్తికేయ కార్యశూరుడు అని వెంటపడతాడని ఎన్టీఆర్ పలు సందర్భాల్లో కామెంట్ చేశారు. కార్తికేయ ఎక్కువగా వార్తల్లో నిలవకపోయినా సినిమాకు సంబంధించి అనుకున్న పని అనుకున్న విధంగా జరిగేలా చేస్తాడు.
కార్తికేయ ఈ అవార్డ్ రావడానికి పరోక్షంగా కారణం కావడంతో కీరవాణి కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు. కార్తికేయ పట్టుబట్టి ఎంతో కష్టపడటం వల్లే ఆస్కార్ కల నెరవేరిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో భారతీయ సినిమాలకు అవార్డులు వచ్చినా ఆర్.ఆర్.ఆర్ అవార్డ్ ఎంతో ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చ అంతాఇంతా కాదు.
ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ సాధించి తెలుగు ప్రేక్షకుల కీర్తిప్రతిష్టలను మరింత పెంచింది. రాజమౌళి, కార్తికేయ ఎంతో కష్టపడి నాటు నాటు సాంగ్ కు అరుదైన గౌరవం దక్కేలా చేశారు. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆస్కార్ కు దక్కిన గౌరవం విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి కష్టానికి మరిన్ని అవార్డులు రావాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.