కొత్తబంగారు లోకం సినిమాతో టాలీవుడ్ కు దర్శకునిగా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల తొలి సినిమాతోనే యువతను ఆకట్టుకున్నారు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. అయితే శ్రీకాంత్ అడ్డాల వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ముకుంద బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ తో శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించారు.
మహేష్ సినీ కెరీర్ లోని డిజాస్టర్ సినిమాలలో బ్రహ్మోత్సవం ఒకటి కాగా ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. బుల్లితెరపై కూడా బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ కావడం గమనార్హం. సాధారణంగా సినిమా ఫ్లాపైనా అభిమానులకు నచ్ఛుతుంది. అయితే బ్రహ్మోత్సవం సినిమా మాత్రం మహేష్ అభిమానులకు ఆకట్టుకోలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన నారప్ప మూవీ రేపు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండగా శ్రీకాంత్ అడ్డాల నారప్ప ప్రమోషన్స్ లో భాగంగా బ్రహ్మోత్సవం సినిమా గురించి స్పందించారు.
స్క్రిప్ట్ బాగా లేకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని మనం ఏదో అనుకుని సినిమాను స్టార్ట్ చేసిన తర్వాత కొన్నిసార్లు అనుకున్న సినిమా అనుకున్న విధంగా రాకపోవచ్చని శ్రీకాంత్ అడ్డాల పేర్కొన్నారు. మహేష్ ఇచ్చిన అద్భుతమైన ఛాన్స్ ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయానని శ్రీకాంత్ అడ్డాల అన్నారు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ ను మరిచిపోయి ముందుకు సాగాలని ఆ సినిమా గురించి ఇప్పుడు పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదని శ్రీకాంత్ అడ్డాల చెప్పుకొచ్చారు.