టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏడాది క్రితం వరకు పూజా హెగ్డే, రష్మిక స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ల చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాజెక్ట్ లు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కొత్త హీరోయిన్ల ఎంట్రీతో పాటు పూజా హెగ్డే, రష్మిక నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈ హీరోయిన్లకు క్రేజ్ తగ్గిందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే
ఈ ఇద్దరు హీరోయిన్ల పారితోషికం ఎక్కువ మొత్తం కావడం వల్ల కూడా ఈ హీరోయిన్ల హవా తగ్గిందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల పారితోషికం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కథల ఎంపికలో ఈ హీరోయిన్లు చేస్తున్న పొరపాట్లే ఈ హీరోయిన్లకు క్రేజ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. శ్రీలీల, కృతిశెట్టి మరి కొందరు హీరోయిన్లకు క్రేజ్ పెరుగుతుండటంతో రష్మిక, పూజా హెగ్డేలపై దర్శకులు దృష్టి పెట్టడం లేదు.
రష్మిక, పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వారసుడు సినిమా సక్సెస్ సాధించినా ఈ సినిమాలో రష్మిక రోల్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. గతేడాది తెలుగులో పూజా హెగ్డే నటించిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. ఈ రీజన్స్ వల్ల కూడా ఈ బ్యూటీలకు సినిమా ఆఫర్లు తగ్గుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పూజా హెగ్డే, రష్మిక రాబోయే రోజుల్లో తెలుగు సినిమాలతో బిజీ అవుతారో లేక ఈ హీరోయిన్లకు ఆఫర్లు మరింత తగ్గుతాయో చూడాల్సి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి రష్మిక, పూజా హెగ్డేలకు ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్ల ద్వారా వాళ్ల క్రేజ్ పెరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.