టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ కు, థమన్ కు ఎక్కువగా అవకాశాలు దక్కుతున్నాయి. దర్శకుడు సుకుమార్, హరీష్ శంకర్ దేవిశ్రీ ప్రసాద్ కు ఎక్కువగా అవకాశాలు ఇస్తుండగా ఇతర దర్శకులు మాత్రం థమన్ ను ప్రోత్సహిస్తున్నారు. సినిమాల సంఖ్య విషయంలో పరిశీలిస్తే దేవిశ్రీ ప్రసాద్ తో పోలిస్తే థమన్ పై చేయి సాధిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ హీరోల ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ మారిపోయారు.
ప్రభాస్ సినిమాకు ఇప్పటివరకు సంగీతం అందించని థమన్ రాధేశ్యామ్ సినిమాకు మాత్రం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించే అవకాశాన్ని దక్కించుకున్నారు. వరుసగా పెద్ద సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న థమన్ తన సినిమాలతో ప్రతి పాట హిట్ అయ్యేలా జాగ్రత్త పడుతుంటంతో వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటున్నారు. గత కొన్నేళ్లలో థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి. థమన్ బీజీఎం సైతం సినిమాల సక్సెస్ కు కారణమవుతోంది.
రామయ్యా వస్తావయ్యా సినిమా రిలీజ్ సమయంలో బీజీఎం విషయంలో విమర్శలు ఎదుర్కొన్న థమన్ అరవింద సమేత, అఖండ సినిమాలను తన మ్యూజిక్ తో నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, చరణ్ శంకర్ కాంబో మూవీ, గాడ్ ఫాదర్, థాంక్యూ, మహేష్ త్రివిక్రమ్ సినిమాలతో థమన్ బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ మూడున్నర కోట్ల రూపాయలకు అటూఇటుగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఇతర స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే థమన్ తీసుకునే రెమ్యునరేషన్ తక్కువ కావడం కూడా అతనికి ప్లస్ అవుతోంది. వేగంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ థమన్ ప్రశంసలను అందుకుంటున్నారని ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు. థమన్ ఈ ఏడాది రిలీజవుతున్న సినిమలలో ఎన్ని సినిమాలతో విజయాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. థమన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.