 
                                                        రోబో లాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందన్న నాటినుండే అంచనాలు మొదలయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తోడవడంతో దేశమంతటా ఇదే హాట్ టాపిక్ గా మారింది. పలు సమస్యలను అధిగమించి గతేడాది డిసెంబర్ లో సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్న విడుదల చేశారు. సినిమా చిత్రీకరణ ఆరంభించి దాదాపు ఏడాది కావచ్చింది. పైగా ప్రచార కార్యక్రమాలు ఆరంభించారు కదా అని సినిమా విడుదలకు సిద్ధమైంది అనుకున్న వాళ్లు ‘2017 దీపావళి విడుదల’ అని చూసి ఖంగుతిన్నారు.
సాధారణంగా ఇటువంటి సినిమాకి చిత్రీకరణ కంటే నిర్మాణాంతర కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయించాలి. అయితే రజిని కొన్నాళ్ళపాటు అనారోగ్యం పాలవడం, సినిమాని త్రీడీ విధానంలో విడుదల చేయాలని నిర్ణయించడం ఇత్యాది కారణాల వల్ల వెనక్కి వెళ్లారట. తొలుత అనుకున్న ప్రకారం అయితే ‘బాహుబలి2’ పోటీనిస్తూ వేసవిలోనే రెండో రోబో థియేటర్ లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం మరో ఏడాది వేచి చూడాల్సిన పరిస్థితి. ‘రోబో’ తరువాత రజనికి మరో సాలిడ్ హిట్ లేకపోవడంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానుల మనసు కాస్త చివుక్కుమందట. మొత్తానికి ‘బాహుబలి’ కలెక్షన్ల చీలిక ముప్పు తప్పింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
