మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లో మరిచిపోలేని చిత్రం మగధీర. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 151 కోట్ల కలక్షన్స్ రాబట్టి తెలుగు చిత్రాల స్థాయిని పెంచింది. గీతాఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించి దర్శకధీరుడు అనే బిరుదు కైవసం చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో రామ్ చరణ్ హీరోగా మళ్లీ రాజమౌళి సినిమా చేస్తారని ఏడేళ్లుగా మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వీరి కాంబినేషన్లో సినిమా ఇక రాదని ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. మగధీర మేకింగ్ సమయంలో రాజమౌళి పనితీరుని అల్లు అరవింద్ అభినందించక పోగా, అవమానించారని వెల్లడించారు.
అందుకే అప్పుడే గీతా ఆర్ట్స్ బ్యానర్లో మూవీ చేయకూడదని జక్కన్న డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక చెర్రీతో అనుభవం రాజమోళి కి గొప్ప పాఠం అయిందంట. పరిశ్రమలోకి వచ్చిన కొత్తల్లో మూవీ కావడంతో చెర్రీ నటించేందుకు చాలా కష్టపడ్డాడని, అతనితో కావలసిన నటన రాబట్టుకోవడానికి రాజమోళి నానా తిప్పలు పడ్డారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సో అతనితో కూడా సినిమా తీయడని స్పష్టం చేశాయి. అందుకే మెగా అభిమానులకు రాజమౌళి, రామ్ చరణ్ కలయికలో మళ్లీ సినిమా చూసే అవకాశం ఉండదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.