గత కొన్నేళ్లుగా మన సినిమాలు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో మన హీరోలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదే బాటలో పూజా హెగ్డే, రష్మిక మందన్న వంటి భామలు కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తమ సత్తా చూపించే పనిలో ఉన్నారు. తాజాగా నయనతార తన కెరీర్‌లో తొలిసారి ఓ బాలీవుడ్ సినిమాతో నార్త్ ప్రేక్షకులను డైరెక్ట్‌గా పలకరించింది. ఈ నేపథ్యంలో బీటౌన్‌లో సత్తా చాటిన 8 దక్షిణాది భామలు ఎవరున్నారో ఓ లుక్కేయండి.
నయనతార
ఇప్పటి వరకు తెలుగు సహా దక్షిణాది భాషలకే పరిమితమైన నయనతార.. సైరా నరసింహారెడ్డి వంటి ప్యాన్ ఇండియా మూవీలతో నార్త్ ప్రేక్షకులను పలకరించినా.. తొలిసారి అట్లీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా నటించిన ‘జవాన్’ మూవీతో తొలిసారి డైరెక్ట్‌గా హిందీ ప్రేక్షకులను పలకరించింది.
రష్మిక మందన్న
రష్మిక మందన్న బాలీవుడ్‌లో ’టాప్ టక్కర్’ అనే ప్రైవేటు ఆల్బమ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను వంటి సినిమాలతో అక్కడి ప్రేక్షకులను అలరించిన ఈమె త్వరలో యానిమల్ మూవీతో పాటు పలకరించనుంది.
పూజా హెగ్డే
సౌత్ సినిమాలతో తెరంగేట్రం చేసిన పూజా హెగ్డే.. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’ సినిమాతో బాలీవుడ్‌లో లెగ్ పెట్టింది. ఆ తర్వాత అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘కభీ ఈద్ కభీ దీవాళి’ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో ఈమె వెంకటేష్ చెల్లెలు పాత్రలో నటించడం విశేషం.
ప్రణీత సుభాష్
ఇక ప్రణీత సుభాష్ .. అజయ్ దేవ్‌గణ్ హీరోగా తెరకెక్కిన ‘భుజ్’ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా డిస్నీ హాట్ స్టార్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ‘హంగామా 2’ మూవీతో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించింది.
రెజీనా
రెజీనా కూడా ఇప్పటికే బాలీవుడ్‌లో ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’ సినిమాతో తెరంగేట్రం చేసింది. అంతకు ముందు ‘ఆంఖే 2’ మూవీతో పరిచయం కావాల్సి ఉన్నా.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రస్తుతం అక్కడ వెబ్ సిరీస్‌లతో అలరిస్తోంది.
ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్ హిందీలో అర్జున్ రాంపాల్ హీరోగా నటించిన ‘డాడీ’ సినిమాతో బాలీవుడ్‌లో లెగ్ పెట్టింది. ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది.
త్రిష
సౌత్ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటిన త్రిష.. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కట్టా మీటా’ సినిమాలో నటించింది. హిందీలో త్రిష నటించిన ఏకైక చిత్రం ఇదే కావడం విశేషం.
ప్రియమణి
ప్రియమణి కూడా హిందీలో ‘రక్త చరిత్ర’, రక్త చరిత్ర 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, మూవీస్‌లో నటించింది. తాజాగా షారుఖ్ ‘జవాన్’లో కీలక పాత్రలో అలరించింది. త్వరలో అజయ్ దేవ్‌గణ్ ‘మైదాన్’ మూవీతో పలకరించనుంది. అటు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్‌తో హిందీ ఆడియన్స్‌కు దగ్గరైన సంగతి తెలిసిందే కదా.
సమంత
సమంత కూడా (Bollywood) బాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వకపోయినా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో హిందీ ప్రేక్షకులను పలకరించింది . నాగ చైతన్యతో విడాకుల తర్వాత వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ‘పుష్ప’లోని ఊ అంటావా ఐటెం సాంగ్‌తో పాపులర్ అయింది. ఈ భామ.. త్వరలో బాలీవుడ్‌తో పాటు ఓ హాలీవుడ్‌లో చిత్రంలో నటించేందకు ఓకే చెప్పింది. ‘ది అరెంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించింది. అటు ‘సీటాడెట్’ వెబ్ సిరీస్‌తో మరోసారి అలరించడానికి రెడీ అవుతోంది