ప్రభాస్ (Prabhas) మారుతి (Maruthi Dasari) కాంబినేషన్ లో ది రాజాసాబ్ (The Rajasaab) అనే టైటిల్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఈ సినిమా ఒకటి కావడం గమనార్హం. అయితే ది రాజాసాబ్ ఆడియో రైట్స్ రూ.15 కోట్లకు అమ్ముడయ్యాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. సౌత్ లో ఈ మధ్య కాలంలో క్రేజీ సినిమాల హక్కులను కొనుగోలు చేసిన సంస్థ ది రాజాసాబ్ ఆడియో హక్కులను కొనుగోలు చేసినట్టు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
The Rajasaab
అయితే ది రాజాసాబ్ (The Rajasaab) ఆడియో రైట్స్ మరీ అంత తక్కువ మొత్తానికి అమ్ముడవడం ఏంటని ఫ్యాన్స్ కామెంట్లు చేశారు. అయితే ప్రభాస్ మూవీ ఆడియో రైట్స్ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని నిర్మాత ఎస్కేఎన్ నుంచి క్లారిటీ వచ్చింది. ది రాజాసాబ్ సినిమాకు థమన్ (S.S.Thaman) మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా థమన్ సినిమాల పాటలు యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి.
థమన్ మ్యూజిక్ అందించిన సినిమాల హక్కులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంటుందనే సంగతి తెలిసిందే. అక్టోబర్ నెల నుంచి ది రాజాసాబ్ (The Rajasaab) మూవీ ప్రమోషన్స్ మొదలు కానున్నాయి. ది రాజాసాబ్ సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్ సైతం ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ది రాజాసాబ్ సినిమా కోసం ఇతర భాషల ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మారుతి టాలెంట్ ను నమ్మి ప్రభాస్ ఈ సినిమాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ప్రభాస్ ఒకింత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కానుంది.