మాటల మాంత్రికుడు… త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురంలో’ వంటి చిత్రాలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాడు. నిజానికి ఆ సినిమాలు అంతంత మాత్రంగానే ఉన్నా భారీ సక్సెస్ లు కొట్టాయి. అది త్రివిక్రమ్ సినిమాలపై జనాలకి ఉన్న నమ్మకం వల్ల అనే చెప్పాలి. అయితే చిన్న చిన్న దర్శకులు కూడా పాన్ ఇండియా బాట పడుతున్న ఈరోజుల్లో.. త్రివిక్రమ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేదు. మహేష్ తో చేస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా కూడా ఒక్క తెలుగు వెర్షన్లోనే రిలీజ్ అవుతుందని వినికిడి.
అయితే ఇప్పుడు పాన్ ఇండియా రూట్లోకి రావడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్టు స్పష్టమవుతుంది. ఈరోజు (Allu Arjun) అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ తర్వాతి సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది. త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటి ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’.. అల్లు అర్జున్ హోమ్ బ్యానర్ అయిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఇది పక్కా పాన్ ఇండియా సినిమా. కథ లాక్ అయ్యింది.
త్రివిక్రమ్ టీం ఆల్రెడీ లొకేషన్స్ కూడా చూసి వచ్చారు. ‘గుంటూరు కారం’ షూటింగ్ ఫినిష్ అయితే వెంటనే అల్లు అర్జున్ సినిమా పనులు మొదలుపెట్టాలి అని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయగా అక్కడ పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే త్రివిక్రమ్ సినిమాల హిందీ వెర్షన్లకి యూట్యూబ్ లో భారీ వ్యూయర్ షిప్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.