‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘దొంగోడు’ ‘వీడే’ వంటి సినిమాలతో రవితేజ (Ravi Teja) కొంచెం స్లో అయ్యాడు. అయితే ఆ తర్వాత శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో ‘వెంకీ’ (Venky) అనే సినిమా చేశాడు. 2004 మార్చి 26న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘లక్ష్మీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై అట్లూరి పూర్ణచంద్రరావు (Atluri Purnachandra Rao) ఈ చిత్రాన్ని నిర్మించారు. స్నేహ (Sneha).. రవితేజకి జోడీగా నటించింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆడియన్స్ ఎగబడి చూశారు.
సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనుకున్న టైంలో ఓ యూత్ ఫుల్ కామెడీ సినిమా రిలీజ్ అయితే ఎలాంటి ఔట్పుట్ వస్తుంది అనే దానికి ‘వెంకీ’ ని ఓ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. రవితేజ నటన శ్రీను వైట్ల డైరెక్షన్ బ్రహ్మానందం (Brahmanandam), ఏవీఎస్(AVS), మల్లికార్జున రావు (Mallikarjuna Rao), ధర్మవరపు సుబ్రహ్మణ్యం (Dharmavarapu Subramanyam), కృష్ణ భగవాన్ (Krishna Bhagavan) ..ల కామెడీ ఈ సినిమాకి మేజర్ హైలెట్ అయ్యింది. హీరో అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసిన కామెడీ కూడా బాగా పండింది.
ముఖ్యంగా ట్రైన్ సీక్వెన్స్ కి ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ కూడా సినిమా సక్సెస్లో కీ రోల్ పోషించింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘వెంకీ’ పక్కన చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాకి ఒక్కరోజు ముందు తేజ (Teja) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై’ (Jai) రిలీజ్ అయ్యింది. అది ఫ్లాప్ అయ్యింది. అలాగే ఆర్.పి.పట్నాయక్ (R. P. Patnaik) నటించిన ‘శ్రీను వాసంతి లక్ష్మీ’ కూడా రిలీజ్ అయ్యింది. అది కూడా ‘వెంకీ’ ముందు నిలబడలేదు.
తర్వాతి వారం ‘అవును నిజమే’ ‘ప్రేమంటే మాదే’ ‘కాశి’ ‘శంఖారావం’ ‘అభి’ వంటి సినిమాలు అన్నీ ‘వెంకీ’ దూకుడుకి తట్టుకోలేకపోయాయి అని చెప్పాలి. మే 7న రిలీజ్ అయిన నాగార్జున (Nagarjuna) ‘నేనున్నాను’ (Nenunnanu) సినిమా ‘వెంకీ’ పోటీని తట్టుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మార్చి 26 తో ‘వెంకీ’ రిలీజ్ అయ్యి 21 ఏళ్ళు పూర్తి కావస్తోంది.