‘భీష్మ’ (Bheeshma) వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత నితిన్ (Nithiin) హీరోగా వెంకీ కుడుముల (Venky Kudumula) కలయికలో రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్'(Robinhood) . ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై.రవిశంకర్(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni) నిర్మాణంలో రూపొందిన సినిమా ఇది. శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్ (Vennela Kishore), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఈ సినిమాలో అతిథి పాత్ర పోషించడం అనేది విశేషంగా చెప్పుకోవాలి.
ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి సినిమా పబ్లిసిటీకి పనికొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా.. ‘అదిద సర్ప్రైజు’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. దానికి చాలా రీల్స్ వచ్చాయి. అందుకే ‘రాబిన్ హుడ్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 28న ఉగాది కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమాని దర్శకనిర్మాతలు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ప్రముఖులకు చూపించడం జరిగింది. అనంతరం వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు.
వారి టాక్ ప్రకారం.. రామ్(నితిన్) రాత్రుళ్ళు రాబిన్ హుడ్ గా మారి దొంగతనాలు చేస్తుంటాడు. అయితే నీరజ(శ్రీలీల) అనే పెద్ద బిజినెస్మెన్ కూతురికి ఇతను ‘Z- కేటగిరి ఫోర్స్’ సెక్యూరిటీ గార్డ్ గా వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. దానికి కారణాలు ఏంటి? అనేది మిగిలిన సినిమాగా తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ టైం పాస్ గా వెళ్లిపోతుందట. ఇంటర్వెల్ సీక్వెన్స్ వద్ద దర్శకుడు వెంకీ కుడుముల మార్క్ ట్విస్ట్ ఉంటుంది అంటున్నారు. ఇక సెకండాఫ్ లో వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్ మంచి హై ఇస్తుందట. క్లైమాక్స్ కూడా ఓకే అనిపిస్తుంది అంటున్నారు. మొత్తంగా పండక్కి ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ‘రాబిన్ హుడ్’ ఉంటుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజున మార్నింగ్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.