టాలీవుడ్ ఇండస్ట్రీలో గత పదేళ్ల నుంచి యంగ్ జనరేషన్ స్టార్ హీరోలలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారు. ఒక్కో సమయంలో ఒక్కో హీరో నంబర్ వన్ గా నిలుస్తున్నా ఎక్కువ సంవత్సరాల పాటు నంబర్ వన్ గా నిలిచే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ ఆరుగురు హీరోలలో అందరికీ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది.
ఈ హీరోల పారితోషికాలు సైతం ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. ప్రతి హీరో 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ ఆరుగురు హీరోలలో ఏ హీరో టాప్ అనేది కచ్చితంగా చెప్పలేము. ప్రస్తుతం అందరు హీరోలు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ హీరో అయినా వరుసగా మూడు ఇండస్ట్రీ హిట్లు సాధిస్తే ఆ హీరోనే నంబర్1 హీరోగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది.
టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీకి నంబర్ వన్ హీరోగా నిలవడం సులువు కాదనే సంగతి తెలిసిందే. ఎంతో కష్టపడితే మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతమవుతుంది. ఈ ఘనతను సొంతం చేసుకునే లక్కీ హీరో ఎవరో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటాలని మరి కొందరు కోరుకుంటున్నారు. టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్స్ మల్టీస్టారర్స్ లో నటిస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ హీరోల సినిమాల బడ్జెట్లు సైతం అంతకంతకూ పెరుగుతున్నాయి. టాలీవుడ్ హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇతర ఇండస్ట్రీలలో కూడా సత్తా చాటుతుండటం గమనార్హం. ప్రభాస్, చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, మహేష్, పవన్ ప్రస్తుతం వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు.