రవితేజ నిర్మాణంలో ఆల్రెడీ రెండు,మూడు సినిమాలు రూపొందాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ‘మట్టీ కుస్తీ'(డబ్బింగ్ సినిమా), ‘రావణాసుర’ వంటి సినిమాలు వచ్చాయి. వీటికి రవితేజ సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూడు సినిమాలు చూస్తే రవితేజ ప్రేక్షకులకు కొత్త రకం కంటెంట్ ను అలాగే ప్రేక్షకులకు కొత్తరకం అనుభూతిని పంచాలని తహతహలాడుతున్నట్టు స్పష్టమవుతుంది. ఫలితం తేడా కొట్టినా ప్రయత్నం ఆపడం లేదు రవితేజ. ఈసారి సోలో నిర్మాతగా ‘ఛాంగురే బంగారు రాజా’ అనే చిత్రాన్ని నిర్మించాడు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ‘C/O కంచరపాలెం’, ‘నారప్ప’ ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా నటించిన మూవీ ఇది. సతీష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు క్రియేటివ్ ప్రోడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ తో అలరించిన గోల్డీ నిస్సీ హీరోయిన్.
రవిబాబు, సత్య కూడా కీలక పాత్రలు పోషించారు. 3 పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. కుక్క కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సునీల్ ఆ పాత్రకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ‘ఓ ప్రమాదంలో ముగ్గురిని కలిసిన తర్వాత ఓ కుక్క జీవితం ఎలా తలకిందులైందో’ అనే ఇంట్రస్టింగ్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కింది. కార్తీక్, సత్య, రవిబాబు ముగ్గురు వేర్వేరు అమ్మాయిలను ప్రేమిస్తున్నట్లు చూపించారు. ఓ హత్య కేసులో నిందితులుగా వీరు అరెస్టు అవ్వడం…
వీళ్ళని ఇరికించిన ఆ హంతకుడు ఎవరు? అనే ఆసక్తిని రేపుతూ హిలేరియస్ గా, గ్రిప్పింగ్ గా ఈ టీజర్ ను కట్ చేశారు. టీజర్ బాగుంది. ఈ సినిమాతో నిర్మాతగా రవితేజ (Ravi Teja) సక్సెస్ కొట్టే అవకాశాలు ఉన్నాయనిపిస్తోంది.