Thodelu Collections: ‘తోడేలు’ పాజిటివ్ టాక్ వచ్చినా.. ఓపెనింగ్స్ రాలేదు..!

వరుణ్ ధావన్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భేదియా’.అమర్ కౌశిక్ ఈ చిత్రానికి దర్శకుడు. జియో స్టూడియోస్ & దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్-కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘తోడేలు’ పేరుతో నవంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ‘గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్’ సంస్థ నిర్మించింది. ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ రావడం అలాగే ‘కాంతార’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన నిర్మాణ సంస్థ కావడంతో ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.

మొదటి రోజు ఈ మూవీకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.07 cr
సీడెడ్ 0.05 cr
ఆంధ్ర 0.05 cr
ఏపీ +తెలంగాణ 0.17 cr

‘తోడేలు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ మూవీకి కేవలం రూ.17 కోట్ల షేర్ మాత్రమే నమోదయ్యింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.2.08 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది.

పోటీగా అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ‘లవ్ టుడే’ వంటి క్రేజీ సినిమాలు ఉండడంతో ఈ మూవీకి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు కాలేదని తెలుస్తుంది. శని, ఆదివారాల్లో బాగా పుంజుకుని కలెక్ట్ చేస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఈ మూవీకి లేవనే చెప్పాలి.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus