మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. యంగ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘కార్తికేయ 2 ‘ ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి పాన్ ఇండియా హిట్లతో మంచి ఫామ్లో ఉన్నారు అభిషేక్ . స్టూవర్టుపురం గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథతో ఈ సినిమా రూపొందింది.
అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. దర్శకుడు వంశీ ఓ బయోపిక్ ను కమర్షియల్ ఫార్మాట్ లో చెప్పడానికి చాలా ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు పెట్టి రన్ టైం పెరిగేలా చేశాడు. ఏదేమైనా ఒకసారైతే ‘టైగర్ నాగేశ్వరరావు’ ని చూడొచ్చు.ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..
‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) మొదటి రోజు రూ.6 నుండి రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టొచ్చు అని తెలుస్తుంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కోసం రూ.37 కోట్ల షేర్ ను రాబట్టాలి. అప్పుడు రెండో రోజు నుండి రూ.30 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. వీకెండ్ ను, దసరా సెలవులకి కరెక్ట్ గా వాడుకుంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి.