మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రం నిన్న అంటే అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యే ఛాన్స్ ఉంది. బాలయ్య, విజయ్ సినిమాలు పోటీగా ఉన్నాయి కాబట్టి భారీ ఓపెనింగ్స్ కాకపోయినా.. మంచి నెంబర్స్ అయితే రిజిస్టర్ అవుతాయి. దసరా పండుగ సెలవులు ఉన్నాయి కాబట్టి.. ఇక్కడ చాలా వరకు ఓకే.
అయితే ఇది మొదటి నుండి పాన్ ఇండియా చిత్రంగా ప్రమోట్ చేసింది చిత్ర బృందం. ముఖ్యంగా హిందీ మార్కెట్ పై ఆశలు బాగా పెట్టుకుంది. రవితేజ అయితే హిందీలో మార్కెట్ సంపాదించాలని చాలా కాలంగా ట్రై చేస్తున్నాడు. ‘ఖిలాడి’ సినిమా అక్కడ మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. దీంతో మొదటి నుండి ‘టైగర్ నాగేశ్వరరావు’ ని హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అక్కడ భారీగా ప్రమోట్ చేశారు.
హిందీ బిగ్ బాస్ హౌస్ కి కూడా రవితేజ వెళ్లి రావడం జరిగింది. అనుపమ్ కేర్ సాయం తీసుకున్నారు. రవితేజ విక్రమార్కుడు, కిక్ సినిమాలు అక్కడ రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా గుర్తు చేశారు. కానీ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) చిత్రానికి హిందీ బెల్ట్ లో టికెట్లు అయితే ఏమీ తెగలేదు. టాక్ అక్కడ పాజిటివ్ గా అయితే రాలేదు.
అందువల్ల ఓపెనింగ్స్ కూడా అక్కడ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ అవ్వడం కూడా జరిగింది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ‘కార్తికేయ 2 ‘ చిత్రాల నిర్మాత నుండి వచ్చిన సినిమా అని పోస్టర్స్ పై వేసినా ఉపయోగం లేదని టాక్.