ఈ మధ్య పెద్ద సినిమా.. చిన్న సినిమా అనే తేడా లేదు. పెద్ద హీరో సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు కాబట్టి అది ‘పెద్ద సినిమా’ .. దానికి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయని అని చెప్పలేం.కంటెంట్ బాగున్న సినిమాకే.. ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అదే పెద్ద సినిమా అవుతుంది. ఇది చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. ఇది పక్కన పెట్టేస్తే.. ఈ సమ్మర్ కి పెద్ద సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. మిడ్ రేంజ్ సినిమాలే పెద్ద సినిమాలు అనుకోవాలి.
ఈ క్రమంలో అందరి దృష్టి ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) ‘ఫ్యామిలీ స్టార్'(Family Star)..ల పై అందరి దృష్టి ఉంది. ఇందులో కూడా ‘ఫ్యామిలీ స్టార్’ కొంచెం పెద్ద సినిమా అనే భావన కొందరిలో ఉంది. కానీ నిన్న అంటే మార్చి 29న రిలీజ్ అయిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు తొలిరోజే ఈ సినిమా రూ.23 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కెరీర్లో ఇవి హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.
రెండో రోజు, మూడో రోజు కూడా ఈ సినిమా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశాలు ఉన్నాయి. వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. నిర్మాత నాగవంశీ అయితే ‘టిల్లు స్క్వేర్’ సినిమా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ‘టిల్లు స్క్వేర్’ హవా.. ఉగాది, రంజాన్ పండుగ సెలవులు ముగిసేవరకు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో ‘ఫ్యామిలీ స్టార్’ భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంటుందా? అనే డౌట్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఆ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప రూ.100 కోట్ల ఫీట్ ను సాధించే ఛాన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఒకవేళ టాక్ కనుక అనుకున్న స్థాయిలో లేకపోతే ‘టిల్లు స్క్వేర్’..పైచేయి సాధిస్తుంది.