టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ప్రస్తుతం సినిమాలకు సంబంధించి రూటు మార్చారు. భారీ సినిమాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. బడ్జెట్ పరంగా సమస్య లేకపోతే జానపద, చారిత్రక సినిమాలను సైతం తెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నారు. మరి కొందరు డైరెక్టర్లు కేజీఎఫ్ తరహా కథాంశాలపై దృష్టి పెడుతూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కుదిరితే బాహుబలి కుదరకపోతే కేజీఎఫ్ అనే సూత్రాన్ని దర్శకులు ఫాలో అవుతున్నారు. అయితే కొంతమంది దర్శకులు ఈ ఫార్ములాను ఫాలో అయ్యి సక్సెస్ సాధిస్తే మరి కొందరు డైరెక్టర్లు మాత్రం ఫ్లాపులతో కెరీర్ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రొటీన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. విభిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలు మాత్రమే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్ల పారితోషికాలు సైతం పెరుగుతున్నాయి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తమ సినిమాల ద్వారా వేర్వేరుగా 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. రాజమౌళి, ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయనే సంగతి తెలిసిందే.
(Directors) జక్కన్న, ప్రశాంత్ నీల్ లకు ప్రేక్షకుల్లో సైతం ఊహించని స్థాయిలో క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ సినిమా తెరకెక్కుతుండగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది.