కథ, నేపథ్యం ప్రకారం అవసరమైన, అనుకూలమైన ప్రాంతాల్లో షూటింగ్ చేయడం అనేది తప్పదు.. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని చిత్రీకరణ జరుపుతుంటారు దర్శక నిర్మాతలు.. సాధారణంగా హౌస్ సెట్స్‌లో, రామోజీ ఫిలిం సిటీలో అందుబాటులో ఉన్న సెట్లలో షూట్ చేస్తుంటారు.. అలాగే స్టూడియోలలోని ఫ్లోర్లలో సాంగ్స్ పిక్చరైజ్ చేస్తుంటారు.. అయితే ప్రస్తుతం కొన్ని తెలుగు సినిమాలు దట్టమైన అటవీ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్..
టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా కమ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ ‘ఆదిపురుష్’ రామాయణం ఆధారంగా.. రాముడి జీవితంలోని ఓ అధ్యాయాన్ని తీసుకుని తెరకెక్కిస్తున్నారు.. సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.. ఏడు వేళ్ల క్రితం నాటి కథను ఇప్పటి మోడ్రన్ టెక్నాలజీతో చూపించనున్నారు.. రాముడి జీవితంలో అడవులకు వెళ్లడం కూడా ఓ భాగమే కాబట్టి ‘ఆదిపురుష్’ లోని కొంత పోర్షన్ ఫారెస్ట్‌లో షూట్ చేశారు..
పుష్ప : ది రూల్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సెన్సేషనల్ ఫిలిం ‘పుష్ప : ది రైజ్’ సీక్వెల్ ‘పుష్ఫ : ది రూల్’ ప్రెస్టీజియస్‌గా రూపొందుతుంది.. ఫస్ట్ పార్ట్‌లో అడవిలో వచ్చే సీన్స్ ఎంతగానో అలరించాయి.. రెండో భాగంలోనూ అడవిలో జరిగే కీలకమైన సన్నివేశాలు ఉండబోతున్నాయి.. వాటిని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తీస్తున్నారు..
SSMB 29..
తెెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు.. భారీ యాక్షన్ అడ్వంచర్ ఫిలింగా తెరకెక్కనున్న ఈ మూవీ షూట్ ఆఫ్రికన్ అడవుల్లో జరుగనుంది.. పాన్ వరల్డ్ ఫిలింగా రూపొందించనున్నారని.. విదేశీ నిర్మాతలు కూడా భాగస్వామ్యం వహిస్తారని సమాచారం..
మారేడుమిల్లి అడవుల్లో నితిన్..
యంగ్ హీరో నితిన్ కంప్లీట్ మాస్ అవతారంలో కనిపించనున్నాడు.. రైటర్ వక్కంతం వంశీ.. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది.. కథ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుందట.. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ మారేడుమిల్లి అడవుల్లో మొదలు పెట్టారు..