తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ‘బాహుబలి’ తో (Baahubali) ఎప్పుడో బౌండరీస్ దాటింది. ‘పుష్ప’ (Pushpa) ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘సలార్’ (Salaar) వంటివి కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాయి. అంతేకాదు కోవిడ్ తర్వాత తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కూడా మారింది. ఆ టైంలో ఓటీటీల్లో సబ్ టైటిల్స్ తో పక్క భాషల సినిమాలు చూడటం మన తెలుగు ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. యూత్ అయితే ఆ సినిమాలని, ఫిలిం మేకర్స్ ని పొగిడేస్తూ సోషల్ మీడియాలో.. డిస్కషన్స్ పెట్టడం అలవాటు చేసుకున్నారు. దీంతో టాలీవుడ్ మేకర్స్ ఆ సినిమాలకి పనిచేసే టెక్నీషియన్స్ ని మన తెలుగు సినిమాల కోసం భారీగా ఖర్చు చేసి పట్టుకొస్తున్నారు.
అలాంటప్పుడు మన తెలుగు ఫిలిం మేకర్స్ కి పక్క భాషల్లో ఎందుకు గుర్తింపు రావడం లేదు? ఇదే ప్రశ్న తాజాగా సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాలని (Sricharan Pakala) అడగడం జరిగింది. ఆయన థ్రిల్లర్ సినిమాలకి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ వస్తున్నాడు. ‘క్షణం’ (Kshanam) ‘గూఢచారి’ (Good Chari) ‘మేజర్’ (Major) వంటి సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులను కూడా మెప్పించాయి. ఆ సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుంది. మరి ‘శ్రీచరణ్ పాకాల..కి ఎందుకు బాలీవుడ్ నుండి కానీ మిగతా భాషల నుండి అవకాశాలు రావడం లేదు’ అనే డౌట్ చాలామందిలో ఉంది.
తాజాగా దీనిపై అతను క్లారిటీ ఇచ్చాడు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. ” నాకు బాలీవుడ్ నుండి ఛాన్సులు వచ్చాయి. కొంతమంది దర్శక నిర్మాతలు తమ సినిమాల కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. కానీ నాకే ఎందుకో వద్దు అనిపించింది. ఆ ఆఫర్స్ లైట్ తీసుకున్నాను” అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. బాలీవుడ్ ఛాన్సుల కోసం చాలా మంది టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎదురుచూస్తున్నారు. అక్కడి సినిమాలు చేస్తే పారితోషికం కూడా ఎక్కువ వస్తుంది.
ఒకవేళ సక్సెస్ సాధించి వరుస ఆఫర్స్ రాబడితే.. ఇక తిరుగుండదు. మరి శ్రీచరణ్ పాకాల ఎందుకు వద్దు అనుకుంటున్నాడో అతనికే తెలియాలి. ఇక అతని సంగీతంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘సత్యభామ’ (Satyabhama) జూన్ 7 న రిలీజ్ కాబోతోంది. కాజల్ (Kajal Aggarwal) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మొత్తం.. శ్రీచరణ్ పాకాల ఫ్రెండ్ సర్కిల్ పనిచేసింది. టీజర్, ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చాయి.ఈ సినిమాకి కూడా శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ ప్లస్ పాయింట్ కాబోతుందని ఇన్సైడ్ టాక్.