చియాన్ విక్రమ్.. కోలీవుడ్లో ఇప్పుడు పెద్ద స్టార్ హీరో. తెలుగులో కూడా ఇతనికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 57 ఏళ్ళ వయసులో కూడా ‘విక్రమ్’.. సినిమా కోసం కష్టపడే విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న ఓ సినిమా ఫస్ట్ లుక్ వస్తే.. అది అందరినీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. అందులో విక్రమ్ అంత భయంకరంగా కనిపించాడు. ఇక ఇటీవల వచ్చిన ‘పొన్నియన్ సెల్వన్-2 ‘ అదే ‘పీఎస్-2 ‘ సినిమాలో ఆదిత్య కారికాలన్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించాడు విక్రమ్.
ఐశ్వర్య రాయ్ కు.. ఇతనికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. అయితే ‘పీఎస్- 2 ‘ ప్రమోషన్స్ లో భాగంగా విక్రమ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ మాట అన్నాడు. గతంలో తెలుగులో చిన్న చిన్న పాత్రలు చేశాను. పెద్ద సినిమాలో నటించాలని ప్రయత్నించాను.. కానీ అది జరగలేదు అన్నట్టు విక్రమ్ చెప్పుకొచ్చాడు. అవును.. గతంలో విక్రమ్ తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవాడు.
‘అక్క పెత్తనం చెల్లెలి కాపురం’ ‘చిరునవ్వుల వరమిస్తావా’ ‘బంగారు కుటుంబం’ ‘ఆడాళ్ళ మజాకా’ ‘ఊహ’ ‘అక్కా బాగున్నావా?’ ‘మెరుపు’ ఇంద్రప్రస్థానం’ ‘9 నెలలు’ వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు విక్రమ్. అయితే అతనికి తెలుగులో కొంత పాపులారిటీ వచ్చాక.. వెళ్లి ఓ దర్శకుడిని ‘మీ సినిమాలో లీడ్ రోల్ నాకు ఇస్తారా’ అని అడిగాడట. అందుకు ఆ దర్శకుడు ‘నిన్ను మెయిన్ లీడ్ గా పెట్టి సినిమా తీస్తే .. సినిమా ఎవడు చూస్తాడు? నువ్వు నేను చూసుకోవాలి’ అంటూ తన టీం ముందు అవమానించాడట.
అందుకు విక్రమ్ (Vikram) ఏమీ డిజప్పాయింట్ అవ్వలేదు. ‘ఏదైనా జరగాలి అని రాసుంటే జరుగుద్ది.. లేదంటే లేదు. కానీ మన ప్రయత్నం మాత్రం ఆపకూడదు’ అని విక్రమ్ సర్దిచెప్పుకున్నాడట. అయితే ‘అపరిచితుడు’ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యాక.. ఆ దర్శకుడు విక్రమ్ తో సినిమా చేయడానికి అతన్ని సంప్రదించాడట. కానీ ఆ టైంలో విక్రమ్ రెండేళ్లకు సరిపడా ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో.. అతనితో సినిమా చేయలేకపోయాడట. ఆ దర్శకుడితో సినిమా చేయనందుకు చాలా బాధపడుతున్నాను అని విక్రమ్ ‘పీఎస్ 2 ‘ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అందుకే ఎవరినీ తక్కువ చేసి చూడకూడదు.