తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అశేష ప్రేక్షకాభిమానం సంపాదించడం చాలా కష్టం. కేవలం కొంతమందికి మాత్రమే ఆ అరుదైన అదృష్టం కలుగుతుంది. ఆ కొంతమందిలో ఒకడు హీరో రామ్. వై వీ ఎస్ చౌదరి దర్శకత్వం లో విడుదలైన రామ్ పోతినేని మొదటి సినిమా ‘దేవదాసు’ అప్పట్లో ఒక సెన్సేషన్. సుమారుగా 15 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది ఈ సినిమా.
అంతే కాదు కొన్ని సెంటర్స్ లో 175 రోజులు, 365 రోజులు కూడా ఆడింది. మొదటి (Devadas) సినిమాతోనే రామ్ తన ఎనెర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిలో పడ్డాడు. ఎవరు ఈ చిచ్చర పిడుగు, ఇంత అద్భుతంగా నటిస్తున్నాడు. డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది అంటూ అప్పట్లో ఆడియన్స్ రామ్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఈ చిత్రం తోనే గోవా బ్యూటీ ఇలియానా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఈ సినిమాని అప్పట్లో వై వీ ఎస్ చౌదరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో చేద్దాం అనుకున్నాడట. ఆయనని కలిసి కథ వినిపించాడు, కథ అల్లు అర్జున్ ఎనర్జీ కి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఉంది. అల్లు అర్జున్ కి కూడా నచ్చింది కానీ, కొన్ని సన్నివేశాలు చాలా ఓవర్ గా ఉన్నాయని, అలాంటివి నాకు సూట్ అవ్వవని, దయచేసి మార్చమని వై వీ ఎస్ చౌదరి ని అడిగారట.
కానీ చౌదరి అందుకు ఒప్పుకోలేదు, నా మేకింగ్ స్టైల్ అలాగే ఉంటుంది, దానిని నేను ఒక హీరో కోసం వదులుకోలేను అని చెప్పాడట వై వీ ఎస్ చౌదరి. అలా ఈ చిత్రం అల్లు అర్జున్ చేతి నుండి రామ్ చేతికి మారింది. ఒకవేళ అల్లు అర్జున్ చెప్పినట్టు ఈ సినిమాలో మార్పులు చేర్పులు చేసి ఉంటే, సినిమా పెద్ద ఫ్లాప్ అయ్యేదేమో అని అంటున్నారు విశ్లేషకులు. కొంత మంది అల్లు అర్జున్ ఈ సినిమా చేసి ఉంటే ఓ రేంజ్ లో ఉండేదేమో అంటున్నారు.