మాట తూటా లాంటిది. ఒకసారి నోరు జారితే వెనక్కి తీసుకోలేము. అందుకే ఆచి తూచి మాట్లాడాలి. ఇక సెలబ్రిటీలు అయితే మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. వారిని కోట్ల కళ్ళు చూస్తుంటాయి. కాస్త నోరు జారినా టీవీ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది. ఒక్క మాటతో గౌరవాన్ని పోగొట్టుకున్న నటీనటులు కూడా ఉన్నారు. అలా టంగ్ స్లిప్ అయిన టాలీవుడ్ స్టార్స్ పై ఫోకస్….
చలపతిరావు
“రారండోయ్ వేడుక చూద్దాం” ప్రీ రిలీజ్ వేడుకలో సీనియర్ నటుడు చలపతిరావుని యాంకర్ “అమ్మాయిలు మనః శాంతికి హానికరమా” అని ప్రశ్నించగా.. అందుకు ఆయన “అమ్మాయిలు మనః శాంతికి హానికరం.. కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు” అని చెప్పి విమర్శలను ఎదుర్కొన్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చలపతిరావు మాటలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన నారీ లోకానికి క్షమాపణలు చెప్పారు. చలపతిరావు డిక్టేటర్ సినిమా ఆడియో వేడుక సమయంలో కూడా బాలకృష్ణ, అంజలి గురించి నోరు జారారు.
అలీ
సన్నాఫ్ సత్యమూర్తి సమయంలో అలీ తోటి యాంకర్ సుమపై నోరు జారారు. “అల్లు అరవింద్ ఎక్కడ నొక్కాలి అని నన్ను అడుగుతున్నారు.. మంచిదైంది సుమని అడగలేదు” అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఈ వివాదం చాలా దూరం వెళ్లింది. మీడియాలో ఈ మాటపై రచ్చ మొదలవడంతో ఆలీ క్షమాపణలు చెప్పారు.
బాలకృష్ణ
సావిత్రి ఆడియో ఫంక్షన్లో బాలకృష్ణ టంగ్ స్లిప్ అయ్యారు. “అమ్మాయిలు వెంట పడే పాత్ర చేస్తే ఫ్యాన్స్ ఊరుకోరు. ముద్దులయిన పెట్టాలి, కడుపైనా చేసెయ్యాలి” అంటూ బాలయ్య చెప్పిన మాటలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వరకు వెళ్ళింది. బాలకృష్ణ ఇమేజ్ ని డ్యామేజ్ చేసింది. ఆ తర్వాత అయన ఎక్కడ లేడీస్ విషయంలో టంగ్ స్లిప్ కాలేదు.
అల్లు అర్జున్
రేసుగుర్రం ఆడియో వేడుకలో అల్లు అర్జున టంగ్ స్లిప్ అయ్యారు. అందులో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ ని అభినందిస్తూ.. “సూపర్ స్టార్ కూతురివి.. నీకెందుకు నీ యమ్మా” అని నోరు జారారు. వెంటనే తన తప్పు తెలుసుకున్న బన్నీ.. క్షమాపణలు చెప్పారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
చెప్పను బ్రదర్
అల్లు అర్జున్ సరైనోడు సక్సస్ సెలబ్రేషన్ వేడుకపై “చెప్పను బ్రదర్” అనే మాట సంచలనం అయింది. వార్తల్లో నిలిచింది. ఆ మాట సోషల్ మీడియాలో కొన్ని రోజుల పాటు ట్రెండింగ్ లో ఉన్నింది. ఉద్దేశపూర్వకంగా బన్నీ చెప్పిన ఆ మాట పరోక్షంగా చాలా నష్టాన్ని కలిగించింది. దీంతో అల్లు అర్జున్ కి యాంటీ ఫ్యాన్స్ ఏర్పడ్డారు.
రానా
రుద్రమదేవి ఆడియో లాంచ్ వేదికపై రానా నోరు జారారు. ఈ సినిమాలో కృష్ణం రాజు గారు, ప్రకాష్ రాజ్ తో కలిసి నటించాను అనబోయి ప్రభాస్ అన్నాడు. ఆ విషయాన్నీ అంతటితో ఆపేయాలని అనుకున్నా.. ఆడియన్స్ ఎక్కువగా అరవడంతో .. “తప్పుగా మాట్లాడాను..” స్వారీ అంటూ నవ్వుతూ చెప్పారు.
ప్రభాస్
ఆర్య 2 ఆడియో లాంచ్ సమయంలో వేదికపై మాట్లాడుతూ ఆ చిత్ర నటీనటులను అభినందిస్తూ .. టంగ్ స్లిప్ అయ్యారు. “కాజల్ హార్డ్ వర్కర్. సూపర్ పర్ఫార్మర్. నేను, తను స్విర్జల్యాండ్ లో 20 రోజులు వర్క్ చేసాము. వెరీ గుడ్” అని నోరు జారారు. అప్పుడు అది దుమారం లేపింది.
నాగబాబు
మెగాస్టార్ చిరంజీవికి 60 ఏళ్ళు సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో నాగబాబు ఉద్వేగంతో ప్రసంగించారు. ఆ సమయంలో మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అని అరుస్తుండడంతో నాగబాబు ఇరిటేట్ అయ్యారు. ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పవన్ కళ్యాణ్ ని ప్రతి సారి పిలుస్తున్నాం.. అతను వస్తే వస్తాడు.. లేకుంటే రాడు. మీరు మాత్రం వినండి” అంటూ అరిచారు. ఈ ఆవేశపూరిత మాటలు నాగబాబుని వార్తల్లో వ్యక్తిని చేశాయి.
ఈ వ్యాఖ్యలు సరదాగా ఉండాలి కానీ .. ఇతరులు బాధపడకుండా మాట్లాడాల్సిన బాధ్యత స్టార్స్ పై ఉంది.