ఈ మధ్య కాలంలో ప్రతీ సినిమాకి థియేట్రికల్స్ తో సమానంగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా కోట్లకు కోట్లు వసూలవుతున్నాయి. మరీ ముఖ్యంగా డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ దక్కుతుంటుంది. కాబట్టి.. ఏ సినిమా అయినా థియేటర్లలో మాత్రమే సక్సెస్ సాధిస్తే సరిపోదు, బుల్లితెర పై కూడా సక్సెస్ సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చాలా కష్టమైన టాస్క్. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటిటిల్లో(డిజిటల్ రిలీజ్) కూడా రిలీజ్ అవుతుంటుంది.
సో అందరి ఫోన్లలో మూవీ అందుబాటులో ఉన్నట్టే. ఈ నేపథ్యంలో వాళ్ళు పనిగట్టుకుని టీవీల్లో టెలికాస్ట్ అయినప్పుడు కూర్చొని చూస్తారు అనుకోవడం అతిశయోక్తే అవుతుంది. కానీ కొన్ని సినిమాలు రికార్డ్ టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు చేసి అవి అపోహలో అని ప్రూవ్ చేసినవి కూడా ఉన్నాయి. బార్క్ (బ్రాడ్ క్యాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్) వారు 2016 లో ఎంటర్ అయ్యారు. వారి లెక్కల ప్రకారం అప్పటి నుండీ అత్యధిక టి.ఆర్. పి రేటింగ్ లు నమోదు చేసిన టాప్ 10 తెలుగు సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :
1) అల వైకుంఠపురములో :
2020 లో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ లేట్ గా టెలికాస్ట్ అయినప్పటికీ 29.4 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
2) సరిలేరు నీకెవ్వరు :
2020లోనే విడుదలైన మరో సూపర్ హిట్ మూవీ ఇది, ఈ మూవీ కూడా 23.4 రికార్డు టి.ఆర్. పి రేటింగ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది.
3) బాహుబలి 2 :
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన అద్భుత చిత్రం… మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 22.7 టి.ఆర్. పి రేటింగ్ ని నమోదు చేసింది
4) శ్రీమంతుడు :
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 22.54 టి.ఆర్.పి రేటింగ్ ని నమోదు చేసింది
5) పుష్ప ది రైజ్ :
ఈ మధ్యనే టెలికాస్ట్ అయిన అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ ఏకంగా 22.50 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
6) దువ్వాడ జగన్నాథం (డి జె) :
అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ కూడా 21.7 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది.
7) బాహుబలి ది బిగినింగ్ :
రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 21.54 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
8) ఫిదా :
వరుణ్ తేజ్- శేఖర్ కమ్ముల- సాయి పల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 21.34 టి.ఆర్. పి ని నమోదు చేసింది
9) గీత గోవిందం :
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 20.8 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది
10) జనతా గ్యారేజ్ :
ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు 20.69 టి.ఆర్. పి రేటింగ్ ను నమోదు చేసింది.