కన్నడ బ్యూటీ షాలిని వాడ్నికట్టి సడన్ గా పెళ్లి చేసుకొని ఆమె ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తమిళ దర్శకుడు మనోజ్ బీదా ను ఆమె వివాహం చేసుకున్నారు. ఆగస్టు 21న కేవలం సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం చెన్నైలో జరిగింది. వీరి పెళ్లి జరిగిన తరువాత ఆరా తీస్తే అసలు విషయాలు బయటికి వచ్చాయి. మనోజ్ బీదా,షాలిని మధ్య చాలా కాలంగా ప్రేమ వ్యవహారం సాగుతుందట. ఇక జూన్ నెలలో వీరిద్దరికి ఎంగేజ్మెంట్ జరిగినట్లు సమాచారం.
పెద్దల సమక్షంలో నిరాడంబరంగా వీరి వివాహం జరిగింది. మనోజ్ 2018లో వచ్చిన థ్రిల్లర్ వంజగర్ ఉలగం మూవీ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక షాలిని వాడ్నికట్టి ఇటీవల ఓటిటి లో విడుదలైన కృష్ణ అండ్ హిస్ లీలా మూవీలో హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 2015లో వచ్చిన ప్లస్ అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది.
కన్నడ, తమిళ చిత్రాలలో నటించిన షాలిని తెలుగులో కెరటం మూవీతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. కృష్ణ అండ్ హిజ్ లీలా, భానుమతి రామకృష్ణ చిత్రాలలో ఈమె నటించింది. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు అందుకున్నాయి. కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో పెళ్లి చేసుకుంది.