బెస్ట్ డే అంటూనే ట్విట్టర్ కి దూరం..!

నవంబర్ 11, 2021 తన కెరీర్ లోనే బెస్ట్ డే అని నటుడు అల్లు శిరీష్ చెబుతున్నారు. తన సంతోషానికి గల కారణాన్ని త్వరలోనే చెబుతానని అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి ఓ ట్వీట్ చేశారు. ‘నా వృత్తిపరమైన జీవితంలో నవంబర్ 11వ తేదీ ఎంతో ఉత్తమమైన రోజు. ఎందుకు.. ఆ స్పెషల్ ఏంటి..? అనేది కొన్ని రోజుల్లో మీతో షేర్ చేసుకుంటాను. అప్పటివరకు కొన్ని కారణాలతో నేను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.

మరోపక్క సిరీస్ చేసిన ట్వీట్ కు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పడానికి కారణమేంటో వెల్లడించాలని కామెంట్స్ చేశారు. ‘అన్నా.. లవ్ సెట్ అయిందా..? పెళ్లి కుదిరిందా..?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా..’ వృత్తిపరంగా స్పెషల్‌ డే అని మరీ మరీ చెప్పాను సామీ’ అని సరదాగా రిప్లై ఇచ్చారు అల్లు శిరీష్. ‘ఏంటన్నా? హాలీవుడ్‌కు వెళ్తున్నావా?’ అని మరో నెటిజన్ అడగ్గా.. దానికి శిరీష్‌..

‘అలాంటి ఆశ అలాంటి ఆశయాలేమీ నాకు లేవు బ్రో, నా కొత్త సినిమా ఫిక్స్‌ అయింది, కథ నచ్చిందనే ఆనందం! నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ స్క్రిప్ట్‌ అవుతుందనే ఆశ’ అంటూ అసలు మ్యాటర్ బయటపెట్టాడు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus