ఏ సినిమాకి అయినా నైజాం ఏరియాలో భారీ కలెక్షన్లు నమోదవుతాయి అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఓ పెద్ద సినిమాకి ఎక్కువగా రికార్డులు నమోదయ్యే ఏరియా ఇదే. అందులోనూ హైదరాబాద్ లోని ఆర్.టి.క్రాస్ రోడ్స్ గురించి బాగా చెప్పుకోవాలి. ఇక్కడ సినీ ప్రియులు ఎక్కువ. ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా ఇక్కడి థియేటర్ల వద్ద ఓ జాతర వాతావరణం ఏర్పడుతుంటుంది. ఇక్కడ సినిమా కనుక చూస్తే.. సినిమాలో ఏ ఒక్క డైలాగ్ కూడా వినపడదు. కానీ ప్రతీ సీన్ మనకి గుర్తుండేలా ఇక్కడి మాస్ ప్రేక్షకుల సందడి ఉంటుంది.
అందుకే సినిమా ప్రమోషన్లు, సక్సెస్ టూర్లు వంటివి ఇక్కడి నుండే మొదలవుతాయి. నిన్న విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఇక్కడ రికార్డ్ కలెక్షన్లు నమోదు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తొలిరోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో భారీ కలెక్షన్లను నమోదు చేసింది. మరి దాని లెక్క ఎంత? దీంతో పాటు గతంలో ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలు ఏంటో తెలుసుకుందాం రండి :
1) ‘ఆర్.ఆర్.ఆర్’ :
రాజమౌళి- రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.77.32 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
2) పుష్ప ది రైజ్ :
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ. 41, 31,445 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
3) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ. 38,06,660 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
4) సరిలేరు నీకెవ్వరు :
మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.37,27,029 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
5) బాహుబలి2 :
ప్రభాస్- రాజమౌళి- రానా కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ. 36,09,236 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
6) రాధే శ్యామ్ :
ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.35,08,380 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
7) వకీల్ సాబ్ :
పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ. 34,40,073 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
8) సాహో :
ప్రభాస్ నటించిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.34,29,293 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
9) మహర్షి :
మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.29,98,581 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.
10) అజ్ఞాతవాసి :
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ లో రూ.28,96,772 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.