తెలుగు సినిమాల్లో హీరోలను (Heroes) ఓ సూపర్ మెన్, స్పైడర్ మెన్.. అనే రీతిలో భావిస్తూ ఉంటారు ప్రేక్షకులు. హీరో కొడితే పదిమంది గాల్లోకి ఎగరాలి. హీరోకి మాత్రం దెబ్బ తగలకూడదు. ప్రతి సీన్లోనూ విలన్ ని హీరో డామినేట్ చేస్తూ ఉండాలి. ఎక్కడా ఎలివేషన్స్ తగ్గకూడదు. ఇక స్టార్ హీరోల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా హీరో ఎంట్రీ 5 నిమిషాల్లో ఇచ్చేయాలి. ఆ వెంటనే అతనికి ఓ భారీ ఫైట్ ఉండాలి. అది అవ్వగానే పాట. అది కూడా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ మాదిరి ఉండాలి. అందులో కూడా హీరోని పొగుడుతూ లిరిక్స్ ఉండాలి.
Heroes
ఒకప్పటి స్టార్ డైరెక్టర్స్ మన తెలుగు ప్రేక్షకులను అలా ప్రిపేర్ చేశారు. కె.రాఘవేంద్రరావు వంటి స్టార్ డైరెక్టర్స్ కూడా ఓ సందర్భంలో ‘5 నిమిషాలకే హీరో ఎంట్రీ ఉండకపోతే ప్రేక్షకులు బోర్ ఫీలవ్వడం మొదలుపెడతారు. అలాగే హీరోకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండాలి’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరోల ఎంట్రీలు డిలే అయ్యాయి. కంటెంట్ ముఖ్యం.. స్క్రీన్ స్పేస్ తర్వాత.. అన్నట్టు ఇప్పటి హీరోలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పావుగంట దాటినా హీరోలు (Heroes) ఎంట్రీ లేని సినిమాల లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
వెంకటేష్ (Venkatesh) ,పి.వాసు (Vasudevan Peethambaran) దర్శకత్వంలో కన్నడ చిత్రం ‘ఆప్త రక్షక’ కి రీమేక్ గా రూపొందిన ‘నాగవల్లి’ (Nagavalli) చిత్రం హీరో వెంకటేష్ ఎంట్రీ 25 నిమిషాల తర్వాతే ఉంటుంది. ‘చంద్రముఖి’ (Chandramukhi) కి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం నెగిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే సాధించింది.
ఎన్టీఆర్ ((Jr NTR)) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో… హీరో ఎన్టీఆర్ 18 నిమిషాల వరకు ఎంట్రీ ఇవ్వడు. మోహన్ లాల్ (Mohanlal) ఎంట్రీతోనే సినిమా మొదలవుతుంది. అయినా సరే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో.. కూడా రవితేజ ఎంట్రీ పావుగంట దాటాకే. ఎగ్జాక్ట్ గా 16 : 02 నిమిషాలకు ఉంటుంది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘పింక్’ కి రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ ఎంట్రీ 19 : 14 నిమిషాలకి ఉంటుంది. అయినా సినిమా బాగానే ఆడింది.
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ‘సింహా’ (Simha) ‘లెజెండ్’ (Legend) వంటి సినిమాల తర్వాత వచ్చిన ‘అఖండ’ లో … హీరో ఎంట్రీ అంటే బాలయ్య ఎంట్రీ 15 :01 నిమిషాల వద్ద ఉంటుంది. అయినప్పటికీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ (K. S. Ravindra) కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో.. మెగాస్టార్ ఎంట్రీ 15 : 01 నిమిషాల వద్ద ఉంటుంది. అయినా సరే సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఎంట్రీ 25 నిమిషాల వరకు ఉండదు అంటే నమ్ముతారా. నిజమే ఈ సినిమాలో అదే జరిగింది. అయినప్పటికీ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో ప్రభాస్ (Prabhas) ఎంట్రీ 20 నిమిషాల వరకు ఉండదు. 21 నిమిషాల వద్ద ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అయినప్పటికీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది.
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో కూడా పావు గంట వరకు హీరో ఎంట్రీ ఉండదు. 18 నిమిషాలు దాటాకే హీరో ఎంట్రీ ఉంటుంది. అయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.
గోపీచంద్ (Gopichand) హీరోగా తెరకెక్కిన ‘విశ్వం’ , ‘రామబాణం’ (Ramabanam) వంటి సినిమాల్లో కూడా పావు గంట వరకు అతని ఎంట్రీ ఉండదు. కానీ వీటిలో ‘విశ్వం’ పర్వాలేదు అనిపించినా, ‘రామబాణం’ డిజాస్టర్ గా మిగిలింది.