గేమ్ ఛేంజర్.. ఇంతకు హిందీలో పరిస్థితి ఎలా ఉంది?

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాపై మొదటివారంలోనే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదలకు ముందు మంచి హైప్ అందుకుంటుందని అనుకున్నప్పటికీ, హిందీ మార్కెట్‌లో ఆ స్థాయిలో క్రేజ్ కలగలేదు. భారీ బడ్జెట్, స్టార్ క్యాస్ట్, మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ప్రమోషన్లలో తక్కువ శ్రద్ధ చూపడం ఇక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్స్ సాధించిన గేమ్ ఛేంజర్, హిందీ వెర్షన్‌లో మాత్రం 8.64 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. ఈ మొత్తం డిసెంట్ అని చెప్పవచ్చినా, గతంలో వచ్చిన టాప్ సౌత్ సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ. ముఖ్యంగా పుష్ప 2, కేజీఎఫ్ 2, బాహుబలి 2 లాంటి చిత్రాలు మొదటిరోజు వసూళ్లలో హిందీ బెల్ట్‌ను శాసించాయి.

సినిమా టాక్ మిశ్రమంగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ తన నటనతో ఆకట్టుకున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, పాన్ ఇండియా సినిమాగా భావించిన ఈ చిత్రానికి హిందీ మార్కెట్‌లో తగిన ప్రోత్సాహం లభించలేదు. ప్రమోషన్ల లోపం, కంటెంట్‌లో కొత్తదనం కొరవడడం వంటి అంశాలు వీటికి కారణంగా చెబుతున్నారు.

తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం, హిందీ మార్కెట్‌లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ సినిమాల జాబితాలో గేమ్ ఛేంజర్ చివర్లో నిలిచింది. పుష్ప 2: ది రూల్ 72 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, కేజీఎఫ్ 2, బాహుబలి 2, ఆదిపురుష్ వంటివి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. సినిమా ప్రమోషన్లు మెరుగుపర్చినట్లయితే, గేమ్ ఛేంజర్ మరింత వసూళ్లు సాధించగలిగేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొదటి రోజు హిందీ వెర్షన్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సౌత్ మూవీస్

1. పుష్ప 2 ది రూల్: 72 కోట్లు

2. కేజీఎఫ్ 2:53.95 కోట్లు

3. బాహుబలి 2: 41 కోట్లు

4. ఆదిపురుష్: 37.25 కోట్లు

5. సాహో: 24.4 కోట్లు

6. కల్కి 2898 AD: 22.50 కోట్లు

7. RRR: 20.07 కోట్లు

8. 2.0: 19.74 కోట్లు

9. సలార్: 15.75 కోట్లు

10. గేమ్ ఛేంజర్: 8.64 కోట్లు

11. దేవర: 7.95 కోట్లు

మొదటి రోజు అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన 10 సినిమాలు.. గేమ్ ఛేంజర్ ఏ ప్లేస్లో ఉంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus