బోయపాటి- రామ్ సినిమా టీజర్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్..!

టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన సినిమా అంటే మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరో 10 రెట్లు మాస్ గా కనిపిస్తాడు. ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ లో భీభత్సమైన మాస్ హీరో ఉన్నాడు అని ‘తులసి’ తో ప్రూవ్ చేశాడు బోయపాటి. రవితేజలో ఉన్న మాస్ ను మరో యాంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. అల్లు అర్జున్ ను సైతం ఊర నాటుగా చూపించాడు.

బాలయ్యను అయితే లార్జర్ దేన్ లైఫ్ అన్నట్టు ప్రెజెంట్ చేస్తుంటాడు. ఇప్పుడు రామ్ తో చేస్తున్న సినిమాలో కూడా అతన్ని 10 రెట్లు మాస్ గా చూపించబోతున్నాడు. ఈ విషయాన్ని చిన్న గ్లింప్స్ తోనే ప్రూవ్ చేశాడు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ ఉన్న రామ్ ను.. మాస్ అవతార్ లో చూపించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు బోయపాటి మరింత మాస్ గా చూపించబోతున్నాడు. ఈరోజు రామ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో రామ్ నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో కనిపించాడు.

“నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…” అనే డైలాగ్స్ తో పూనకాలు తెప్పించాడు రామ్. అయితే రామ్ లుక్స్ పై అలాగే ఈ టీజర్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus