త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అవమానిస్తూ కామెంట్లు
- December 8, 2016 / 11:20 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లోని గొప్పదర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయన అచ్చమైన, స్వచ్ఛమైన చిత్రాలను తెరకెక్కించారు. జంధ్యాల తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసిన దర్శకుడిగా పేరుగాంచిన మాటల మాంత్రికుడిపై కొంతమంది నెటిజనులు పంచులు విసురుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారనే వార్త వెలువడి నప్పటి నుంచి.. ‘ఇందుకోసం లోకల్ మూవీ నుంచి కథను కాపీ కొడతారా? ఇందులో విదేశీ చిత్రాల్లోంచి సీన్లను దించుతారా? అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ పై హాట్ చర్చ కొనసాగుతోంది. అత్యంత సున్నితమైన అంశాలను, అనుబంధాలను ప్రధాన అంశముగా తీసుకొని కమర్షియల్ మూవీ తీయగల సత్తా త్రివిక్రమ్ సొంతమని ఆయన అభిమానులు సమర్దిస్తుంటే.. విమర్శకులు మాత్రం.. త్రివిక్రమ్ సొంతంగా మాటలను రాస్తారు. కథలను, సీన్లను కాపీ కొడతారని ఆరోపిస్తున్నారు.
అ..ఆ కథను మీనా సినిమానుంచి కాఫీ కొట్టేసి, ఎవరూ కనిపెట్టలేరని ఆ సినిమాకు గాని, ఆ నవల రాసిన రచయిత్రికి గాని క్రెడిట్ ఇవ్వని సంగతిని ఎత్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లోని కొన్ని సీన్లు ఫ్రెంచ్ మూవీ నుంచి దిగుమతి చేసుకున్నదేనని వివరిస్తున్నారు. అతడు, జులాయి మూవీలోని ఇంట్రడక్షన్ సీన్లు ఇంగ్లీష్ సినిమాల నుంచి కాపీ కొట్టారని ఆరోపిస్తున్నారు. “విదేశీ చిత్రాలను చూసి స్ఫూర్తి తో కొన్ని సీన్లు త్రివిక్రమ్ రాసినప్పటికీ.. అది కాపీ కాదు. ఎందుకంటే వాటిని పూర్తిగా మన నేటివిటీలోకి మార్చి అందించారు. అంతమాత్రాన మాటల మాంత్రికుడిపై ఈ నిందలు మోపడం మంచిది కాదు” అని సినీ ప్రముఖులు త్రివిక్రమ్ పక్షాన నిలుస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















