త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే మాటల మాంత్రికుడు, ప్రొఫెషనల్ డైరెక్టర్ మాత్రమే కాదు, పవన్ కు అత్యంత సన్నిహితుడు. పవన్ కు మంచి స్నేహితుడు. అయితే పవన్ విషయంలో త్రివిక్రమ్ చాలా లోతుగా ఆలోచిస్తాడు. అందుకే పవన్ తో ఆయన తీసిన జల్సా, అత్తారింటికి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మరి అలాంటి త్రివిక్రమ్ పవన్ సర్దార్ విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యాడు. సర్దార్ సినిమాకు తాను వెనుక నుంచి పవన్ కు ఎంతో సహాయం చేసినప్పటికీ సినిమా ఎందుకు డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇంతకీ సర్దార్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేసాడంటే…‘సర్దార్’ ఘన విజయం సాధించాలని తనకు ఎంతో నమ్మకం ఉన్న సిద్దాంతి చేత ‘సర్దార్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేయించడమే కాకుండా ‘సర్దార్ స్పెషల్ షోకు అర్దరాత్రి 12.50 నిముషాలకు ముహూర్తం పెట్టించినా ఆ ముహూర్తం కూడ ‘సర్దార్’ కు కలిసి రాకపోవడం త్రివిక్రమ్ ను అనుకోని షాక్ కు గురి చేసింది. మరో పక్క పవన్ సైతం తాను డబ్బుల కోసమే సినిమా చేశాను తప్పా, రికార్డులను మెళ్ళో వేసుకుని తిరగడానికి కాదు అని, ఆర్ధిక పరిస్థితులు కాస్త ఇబ్బందులు పెట్టడంతో అలా చెయ్యాల్సి వచ్చింది అని ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో చెప్పాడు. మరి ఎవ్వరు ఎన్ని చెప్పినా ఈ సంవత్సరపు సూపర్ ఫ్లాప్ గా పేరు తెచ్చుకున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షాక్ నుండి ఇంకా పూర్తిగా బయటకు రాలేక పోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.