Trivikram, Ram Charan: త్రివిక్రమ్ తో రామ్ చరణ్ సినిమా పక్కా..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తన తండ్రి చిరంజీవితో కలిసి ఈ సినిమాలో నటించారు రామ్ చరణ్. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు తండ్రీకొడుకులు. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు రామ్ చరణ్. తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ.. ఓ టాప్ డైరెక్టర్ గురించి ప్రస్తావించారు రామ్ చరణ్.

Click Here To Watch NOW

ప్రస్తుతం శంకర్ తో ఓ సినిమా చేస్తోన్న ఈ మెగాహీరో.. అది పూర్తయిన తరువాత గౌతమ్ తిన్ననూరితో మరో సినిమా చేయనున్నారు. అలానే ఓ పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారు. ఈ మధ్య తననొక పెద్ద దర్శకుడు కలిశారని.. తన దగ్గర మూడ్నాలుగు కథలు ఉన్నాయని, వాటిలో ఒకటి చేద్దామని చెప్పాడని చరణ్ తెలిపారు. దానికి రామ్ చరణ్.. ‘మీరు చాలా పెద్ద డైరెక్టర్. నాతో ఏ కథ చేస్తే బాగుంటుందని, మీ కథల్లో ఏ పాత్రకు నేను బాగా సూటవుతానో మీకు కచ్చితంగా తెలుస్తుంది.

కాబట్టి మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ కథతో సినిమా చేద్దాం’ అని చెప్పారట. ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం చరణ్ చెప్పలేదు. కానీ నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరనే విషయంలో చర్చలు మొదలుపెట్టారు. టాలీవుడ్ లో ఇప్పటివరకు చరణ్ పని చేయని పెద్ద దర్శకుడు ఎవరన్నా ఉన్నారంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి.

కానీ.. ఇప్పటివరకు అయితే ఈ కాంబో సెట్ కాలేదు. కాబట్టి చరణ్ చెప్పింది త్రివిక్రమ్ గురించే అయి ఉంటుందని.. ఫ్యూచర్ లో వీరి కాంబోలో ఓ సినిమా తప్పకుండా వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus