సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న వారిలో అలియా భట్ ముందు వరసలో ఉంది. ఆమె స్టార్ కిడ్ కావడంతో పాటు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న మహేష్ భట్ కూతురు కావడంతో ఆమెను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఆమెపై తమ కోపాన్ని ద్వేషాన్ని కామెంట్స్ రూపంలో బయటపెడుతున్నారు. ఇటీవల విడుదలైన సడక్ 2 ట్రైలర్ పై ఎంతగా నెగెటివ్ ప్రచారం చేశారో చూశాం.
మోస్ట్ డిజ్ లైక్డ్ ట్రైలర్ గా వరల్డ్ రికార్డు నెలకొల్పారు. కాగా కొద్దిరోజులలో సడక్ 2 మూవీ డిస్నీ హాట్ స్టార్ లో విడుదల కానుంది. దీనితో ఆ మూవీ ప్రొమోషన్స్ కి సంబంధించి ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పై కామెంట్స్ తో సుశాంత్ ఫ్యాన్స్ దాడి చేస్తారని భావించిన అలియా తనను ఫాలో అయ్యేవాళ్ళు మాత్రమే కామెంట్ చేసేలా సెట్టింగ్స్ మార్చారు. దీనితో అలియా పై ఎవరైనా కామెంట్ పెట్టాలంటే ఆమెను ఫాలో చేయాలి.
సుశాంత్ ఫ్యాన్స్ తో పాటు ఆమెను తిరస్కరిస్తున్న అనేక మంది నెటిజెన్స్ అన్ ఫాలో చేయడం జరిగింది. దీనితో ఆమెపై కామెంట్స్ అండ్ ట్రోల్ల్స్ దాడి తగ్గింది అని చెప్పాలి. సడక్ 2 ట్రైలర్ పై సుశాంత్ ఫ్యాన్స్ చేసిన నెగెటివ్ ప్రచారం చూశాక ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఆమెను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.