హిందీలో రూపొందిన ‘కిల్’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే నార్త్ లో కంటే కూడా.. ఆ సినిమాని సౌత్ ప్రేక్షకులే ఎక్కువగా చూశారు. సినిమాలో ఉన్న ఎమోషనల్ కంటెంట్ అలాంటిది. కథగా చెప్పుకుంటే.. కొత్తగా ‘కిల్’ (Kill) లో ఏమీ ఉండదు. కానీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా.. విలన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. దాని చుట్టూ వచ్చే యాక్షన్ సన్నివేశాలు.. బాగా ఆకట్టుకుంటాయి.
Kill
ఈ మధ్యనే ‘కిల్’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో అందుబాటులో ఉంది ఈ సినిమా. ఇక్కడ కూడా సినిమాని ఎగబడి చూస్తున్నారు. అందులో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు కూడా ఉండటంతో.. ‘కిల్’ తెలుగు వెర్షన్ ను కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో పెట్టడం జరిగింది. అయితే తెలుగు వెర్షన్.. డబ్బింగ్ సెట్ అవ్వలేదు అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. వారి కామెంట్లకి తగ్గట్టే..
ఎందుకో తెలుగు డబ్బింగ్ తేడా కొట్టింది. లిప్-సింక్ కూడా కంప్లీట్ గా మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఒరిజినల్ వెర్షన్ బెస్ట్ అనేది కొందరి అభిప్రాయం. మరోపక్క.. ‘కిల్’ చిత్రం రీమేక్ రైట్స్ ను కోనేరు సత్యనారాయణ దక్కించుకున్నారు. తెలుగులో వరుణ్ తేజ్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఆయన భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తెలుగు వెర్షన్ ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. కొన్ని కీలక మార్పులు చేస్తే తప్ప.. థియేటర్లలో వర్కౌట్ అవ్వడం కష్టం అని చెప్పాలి