ఒక సినిమా సూపర్ హిట్ అయితే దర్శక నిర్మాత, నటీనటులకు పేరు, ఆఫర్లు వస్తాయి.. అదే ప్రశంసలు, పురస్కారాలు లభిస్తే.. కష్టానికి తగ్గ ప్రతిఫలంలా అవార్డులు వరిస్తే మరింత కష్టపడి పని చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.. రిస్క్ చేసి ఓ చిత్రాన్ని తెరకెక్కించి అద్బుత విజయం సాధించిన తర్వాత అవార్డులు అందుకుంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది.. సరిగ్గా ఇలాంటి అనుభూతినే పొందాడు నందమూరి కళ్యాణ్ రామ్.. నటుడిగానే కాకుండా అభిరుచిగల నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్న కళ్యాణ్ రామ్..
తమ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో నిర్మించిన ‘బింబిసార’ చిత్రానికి గానూ రెండ్ అవార్డులు అందుకున్నాడు.. కొత్త దర్శకుడు, కథని నమ్మి కోట్లాది రూపాయలు ఖర్చు.. ద్విపాత్రాభినయం, హిస్టారికల్ బ్యాక్ డ్రాప్.. ఏ మాత్రం తడబడ్డా మొదటికే మోసం వచ్చే పరిస్థితి.. కానీ కళ్యాణ్ రామ్ రిస్క్ చేశాడు.. ఫలితం.. ‘బింబిసార’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడమే కాక తన కెరీర్‌లో అతి పెద్ద హిట్, అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డ్ నెలకొల్పింది..
దీంతో ‘బింబిసార 2’ మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. పైగా పార్ట్ 2లో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నారని చెప్పడంతో ఆకాశాన్నంటేశాయి.. ఇదిలా ఉంటే.. తాజాగా ఉగాది పురస్కారాల్లో ‘బింబిసార’ రెండు అవార్డులు దక్కించుకుంది.. శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ వారు ఇచ్చే ఉగాది పురస్కారాల వేడుక 2023 ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది.. వివిధ కేటగిరీల్లో పలువురు తెలుగు చలనచిత్ర ప్రముఖులకు ఈ అవార్డులు అందజేశారు..
ఉత్తమ చిత్రం విభాగంలో ‘బింబిసార’.. అలాగే ‘బింబిసార’ లోని అద్భుతమైన నటనకు గానూ ‘ఉత్తమ నటుడు’ గా కళ్యాణ్ రామ్ ఈ అవార్డును స్వీకరించాడు.. తనను తాత ఎన్టీఆర్‌తో పోల్చడం సరికాదని.. నటనలో ఆయన ఒక ఎవరెస్ట్ అని.. తాత గారితో పోల్చుకునే ఆలోచనే తప్పని అన్నాడు కళ్యాణ్ రామ్.. అవార్డులు అందజేసిన వారికి తన కృతజ్ఞతలు తెలియజేశాడు కళ్యాణ్ రామ్..
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?