‘కార్తీక దీపం’ సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయిన ఉమా దేవి.. తాజాగా ‘బిగ్ బాస్5’ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘బిగ్ బాస్5’ కు ఆమె 8వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఈమె అర్ధపావు భాగ్యలక్ష్మీ పాత్రని పోషిస్తూ వస్తోంది. మొదట్లో దీప(వంటలక్క) ని చిత్ర హింసలు పెట్టే సవతి తల్లిగా.. ఇప్పుడైతే ఆమెకు అండగా నిలబడే అమ్మగా ఆమె కనిపిస్తూ వస్తోంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె ‘బిగ్ బాస్5’ లోకి ఎంట్రీ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఈమె గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులు :
ఉమా దేవి పుట్టిపెరిగింది అంతా వైజాగ్ లో..! కానీ కొన్ని కారణాల వలన ఈమె చిన్నప్పుడే వీళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయింది. ఈమె తండ్రి జి.హెచ్.ఎం.సి లో పనిచేసేవారట. ఈమె బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళ.
ఈమెది ప్రేమ వివాహం. ఈమె 18వ ఏటనే పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు.
ఈమెకు వివాహా బంధం అంతగా కలిసి రాలేదు అని, పెళ్ళైన ఏడేళ్లకు విడిపోయామని, మళ్లీ పిల్లల కోసం కలిసినట్టు తెలిపింది. అయినా ఉపయోగం లేకుండా పోయిందని కూడా ఎమోషనల్ అయ్యింది.తన బాధల్ని సెట్ పై చూపించనని..ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను.. నవ్విస్తూనే ఉంటాను అంటుంది ఉమా.
ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ.. సినిమాల్లో పనిచేస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోతుందట.ఎటువంటి సినిమా అయినా ఆ పాత్రకి న్యాయం చేయడానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తాను అని ఈమె తెలియజేసింది.
ఉమా పెద్దమ్మాయి జర్నలిజం చేసిందట. ఈమె బాధ్యతల్లో ఆమె కూడా పాలుపంచుకుంటూ ఉంటుందని తెలుస్తుంది.
ఉమా దేవి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె కాబట్టి.. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాల్లో బ్రాహ్మణ మహిళగా కనిపించలేకపోయిందట. అలాంటి పాత్ర ఒకటి చేయాలనేది ఈమె డ్రీం అట.
ఈమె కెరీర్ ప్రారంభంలో ఓ బోల్డ్ సినిమాలో కూడా నటించింది. అప్పట్లో చిన్న చిన్న ఆర్టిస్ట్ లకి కథ గురించి కానీ వాళ్ళ పాత్రల గురించి కానీ ఎక్కువ చెప్పేవారు కాదట దర్శకనిర్మాతలు.సీన్ చిత్రీకరణ టైం వరకు వాళ్ళ పాత్ర ఏమిటి అనేది చెప్పేవారు కాదట. తీరా అక్కడి వరకు వెళ్లిన తర్వాత అవకాశాలను వదులుకోవడం ఇష్టం లేక ఆ పాత్ర చేయాల్సి వచ్చేదని ఈమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
ఈమె అనేక సినిమాల్లో నటించినప్పటికీ.. ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం సీరియల్సే.
ఉమా బాగా వంట చేయగలదు. ఈమెకు ఆధ్యాత్మికత విషయాలకు ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు. వీళ్ళ పిల్లలకి కూడా ఆధ్యాత్మికత గురించి చెబుతుంటుంది.
గతంలో ఉమ చాలా సినిమాల్లో నటించింది. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘బాచి’ ‘అమ్మా నాన్న ఓ తమిళ్ అమ్మాయి’ ‘సూపర్’ వంటి చిత్రాలతో పాటు ‘మల్లీశ్వరి’ ‘నేను’ ‘సై’ ‘మధుమాసం’ ‘తులసి’ ‘అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి’ ‘రెబల్’ ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాల్లో నటించింది.
ఇక ఈమె నటించే ప్రతీ సీరియల్లోనూ గయ్యాళిగానే కనిపించింది.ఆ ముద్రని చెరిపేయడం కోసమే ‘బిగ్ బాస్5’ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఈమె తెలియజేసింది.